Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ ఛాన్సిస్తానని చెప్పి మోసం చేసింది.. ఆ హీరోయిన్‌పై వ్యక్తి ఫిర్యాదు

డెబీనా బెనర్జీ ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆరేళ్ల క్రితం తెలుగులో వచ్చిన 'అమ్మాయిలు - అబ్బాయిలు' చిత్రంలో నటించిన హీరోయిన్. ఆ తర్వాత ఈమెకు సినీ అవకాశాలు లేకపోవడంతో ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (08:55 IST)
డెబీనా బెనర్జీ ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆరేళ్ల క్రితం తెలుగులో వచ్చిన 'అమ్మాయిలు - అబ్బాయిలు' చిత్రంలో నటించిన హీరోయిన్. ఆ తర్వాత ఈమెకు సినీ అవకాశాలు లేకపోవడంతో ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. అయితే, డబ్బు సంపాదించాలన్న ఆశతో మోసాలకు పాల్పడినట్టు ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
రాజస్థాన్‌ రాష్ట్రంలోని నొఖా పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అందులో హిందీ సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని తనకు చెప్పిన డెబ్లీనా.. తన నుంచి రూ.11 లక్షల మేరకు మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మోసంలో ఆమె భర్తకు కూడా సంబంధం ఉందని తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు డెబీనా, గుర్మీత్ చౌదరి జంటకు నోటీసులు పంపించారు.
 
ఇక తనపై కేసు నమోదైన విషయాన్ని తెలుసుకున్న గుర్మీత్, సదరు బాధితుడికి వ్యతిరేకంగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తన పేరును తప్పుగా వాడుకుంటున్నాడని, సదరు వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అతనికి, తనకూ మధ్య లావాదేవీలు జరగలేదని ఆమె చెబుతోంది. దీంతో పోలీసులు మాత్రం రెండు కేసులూ నమోదు చేసుకుని విచారణలో నిజాలు తేలుస్తామని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments