Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర‌లోనూ లైంగిక వేధింపులు - ప్రియ‌మ‌ణి చెప్పిన నిజాలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (22:10 IST)
Kartika deepam -priyamani
సినిమారంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం ప్ర‌పంచం మొత్తంగా వివాదాస్పందంగా మారింది. కానీ టీవీరంగం గురించి పెద్ద‌గా చెప్ప‌లేద‌నుకున్నారు. కానీ అక్క‌డా విప‌రీతంగా వుంటుంద‌ని న‌టి ప్రియ‌మ‌ణి చెబుతోంది. ఈమె ‘కార్తీకదీపం’ సీరియ‌ల్‌లో ప‌నిమ‌నిషిగా న‌టిస్తోంది. ఇక బుల్లితెర‌లో న‌టించాలంటే ఏ పాత్ర‌కైనా, చిన్న‌ద‌యినా స‌రే అమ్మాయి అందంగా వుండాలి. చూడ‌డానికి ఆనాలి. అంటూ ద‌ర్శ‌కులు ముందుగానే అసిస్టెంట్ల‌కు, మేనేజ‌ర్ల‌కు చెబుతుంటారు. అలా వ‌చ్చిన అమ్మాయే ప్రియ‌మ‌ణి. ఆమె ఇటీవ‌లో ఓ యూట్యూబ్‌లో త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేసింది.
 
సినిమారంగంలోనేకాదు. బ‌య‌ట కూడా అన్నిరంగాల్లోనూ మ‌హిళ‌కు ర‌క్ష‌ణ‌లేదంటూ గ‌ట్టిగా చెప్పింది.  కమిట్‌మెంట్స్ అనేవి ఇండస్ట్రీలో ఉన్నాయని, తాను కూడా అలాంటివి ఫేస్ చేశానని చెబుతూ ఆమె ఓపెన్ అయింది. తానే కాదు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి అమ్మాయికి ఇలాంటి సందర్భం ఎక్కడో ఓ చోట ఎదురవుతూనే ఉంటుందని, అయితే అందుకు అంగీకారం తెలపడమా లేదా అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
 
క‌మిట్‌మెంట్ పేరుతో సాగే లైంగిక దోపీడీ విషయంలో వార్నింగ్ లాంటివి ఇస్తే ఇక కెరీర్ అక్కడితో ముగిసినట్లే అంటూ ఆమె చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తన విషయంలో అలాంటి సందర్భం ఎదురైనపుడు అయితే ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా సింపుల్‌గా నవ్వుతూ బయటకొచ్చానని చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి విష‌యంలో బేక్‌గ్రౌండ్ వున్న అమ్మాయిల‌కు ఎటువంటి ఇబ్బందిలేద‌నే సీక్రెట్ చెప్పింది. సో. మ‌హిళ‌లు విప‌రీతంగా ఆద‌ర‌ణిస్తున్న కార్తిక‌దీపం వెనుక ఇన్ని క‌థ‌లున్నాయ‌న్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం