Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా సైజ్‌ను చూసి ఇష్ట‌ప‌డ్డారా! అంటూ ఫైర్ అయిన ప్రియమణి

Advertiesment
నా సైజ్‌ను చూసి ఇష్ట‌ప‌డ్డారా! అంటూ ఫైర్ అయిన  ప్రియమణి
, శనివారం, 12 జూన్ 2021 (19:12 IST)
Priyamani
న‌టి ప్రియ‌మ‌ణి నెటిజ‌న్ల‌పై ఫైర్ అయింది. ఇటీవ‌లే ఆమె న‌టించిన ఫ్యామిలీమెన్‌2 సినిమా ఆమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది. స‌మంతను అంద‌రూ అద్భుతంగా న‌టించింద‌ని పొగిడితే, ప్రియ‌మ‌ణికి మాత్రం రివ‌ర్స్ అయింది. ప్రియ‌మ‌ణి ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయి భార్య‌గా న‌టించింది. ఆమె క‌నిపించిన శ‌రీరాకృతి, క‌ల‌రింగ్‌పై చాలామంది ప‌లు విధాలుగా కామెంట్ చేశారు. ఆమె రంగుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చిత్రాలపై చాలా మంది వ్యాఖ్యానించారు. దానికి ఆమె ఈర‌కంగా రియాక్ట్ అయింది.
 
ఇప్ప‌టికే తెలుగులో ఓ ఛాన‌ల్‌లో వ‌స్తున్న డాన్స్ ప్రోగ్రామ్‌లో జ‌డ్జిగా వున్నారు. ఆమె బాగా స‌న్న‌బ‌డ్డారు. చూడ్డానికి ఒక‌ర‌క‌మైన పేషెంట్‌లానూ క‌నిపించారు. ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన య‌మ‌దొంగ‌లో వున్న ఆమె శ‌రీరాకృతికి ఇప్ప‌టికి చాలా తేడా వుంది. ఆమె చ‌ర్మ‌రంగు కూడా కాస్త మారింది. ఈ విష‌య‌మై నెటిజ‌ర్లు ఘాటుగానే కామెంట్ చేశారు. దానికి ఆమె కూడా ఘాటుగానే స‌మాధాన‌మిచ్చింది. `ఓహ్ మీరు లావుగా వున్న‌ప్పుడు నేను ఇష్ట‌ప‌డ్డాను. ఇప్పుడు మ‌రీ స‌న్న‌గా వున్నారు. మీ క‌ల‌ర్‌ కూడా బాగాలేదు అంటూ కామెంట్ చేశారు.

దాంతో ప్రియ‌మ‌ణి ఘాటుగా స్పందిస్తూ, నిజాయితీగా చెప్పాలంటే, నా బరువు 65 కిలోలు. నేను ప్రస్తుతం ఉన్నదానికంటే అందులో పెద్దదిగా కనిపించాను. నేను లావుగా వుంటేనే  మీరు ఇష్ట‌ప‌డ్డారా. స‌న్న‌గా వుంటే లేదా! ఒక‌సారి మీ మైండ్‌సెట్ మార్చుకోండి. శ‌రీరాకృతిని చూసి ఇష్ట‌ప‌డ‌తారా! సైజ్‌ను బ‌ట్టి అంచ‌నావేస్తారా: అంటూ విరుచుకుప‌డింది. దాంతో మీరు ఇంత‌కు ముందుకంటే స్లిమ్‌గానే వున్నారంటూ మ‌రొక‌రు కూల్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాకు వి.వి. వినాయ‌క్‌!