Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఛాన్సులు లేక విజయ్ సూసైడ్ చేసుకోలేదు : ధన్‌రాజ్

బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో నటించిన కమెడియన్ విజయ్ సాయి ఆదివారం రాత్రి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (16:56 IST)
బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో నటించిన కమెడియన్ విజయ్ సాయి ఆదివారం రాత్రి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమాల్లో అవ‌కాశాలు రాకే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. సినీ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన విజయ్ సాయి బలవన్మరణానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి.
 
వీటిపై మరో కమెడియన్ ధన్‌రాజ్ స్పందిస్తూ, విజయ్ సినిమాల్లో అవ‌కాశాలు రాకే ఆత్మ‌హ‌త్య చేసుకోలేదన్నారు. విజ‌య్ ప్ర‌స్తుతం రెండు, మూడు సినిమాల్లో నటిస్తున్నాడని గుర్తు చేశాడు. విజ‌య్‌కి వ్య‌క్తిగ‌త బాధ‌లు ఏమున్నాయో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నాడు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై సమగ్ర దర్య్పు జరపాలని ధన్‌రాజ్ కోరాడు. విజ‌య్ త‌ల్లి ప‌రిస్థితి చూస్తోంటే చాలా బాధేస్తోంద‌ని వ్యాఖ్యానించాడు.
 
కాగా, హాస్యనటుడు విజయ్ తాను చనిపోయే కంటే ముందు సెల్ఫీ వీడియోలో సంచలనాత్మక విషయాలు వెల్లడించాడు. తన చావుకు భార్య వనితనే కారణమని పేర్కొన్నాడు. 'వాల్ పోస్టర్' సినిమా షూటింగ్‌లో వనిత తనకు పరిచయం అయిందన్నాడు. పెళ్లి అయిన తర్వాత వనిత నిజస్వరూపం తెలిసిందన్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం.. తన భార్యను కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకున్నారని వెల్లడించాడు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి తనకు, వనితకు అనేకసార్లు గొడవలు అయ్యాయని చెప్పాడు. చివరకు తన కూతురు కుందనను కూడా చూడనివ్వలేదని పేర్కొన్నాడు. 
 
వనితకు గతంలోనే అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్లి అయిందన్నాడు. తన భార్య, ఆమె తల్లి వ్యభిచారం చేసేవారని వారి సొంతూరుకు వెళ్తే తెలిసిందని విజయ్ వీడియోలో పేర్కొన్నాడు. ఇలాంటి వారి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. వనిత లాంటి వారిని వదలొద్దు. డాడీ.. ఎవ్వరిని విడిచిపెట్టొద్దు.. నిద్ర పట్టడం లేదు. అందరికీ శిక్ష పడేలా చూడు.. లవ్ యూ డాడీ అంటూ ప్రాధేయపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments