పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

దేవీ
గురువారం, 15 మే 2025 (16:59 IST)
Janam poster
సుమ‌న్, అజ‌య్ ఘోష్, కిషోర్, వెంక‌టర‌మ‌ణ‌, ప్ర‌గ్య‌ నైనా  నటించిన చిత్రం జ‌నం. వెంక‌టర‌మ‌ణ ప‌సుపులేటి స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన  “జ‌నం” మూవీ మే 29న రీ-రిలీజ్ కాబోతుంది. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 10న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటన లను ఎత్తి చూపిస్తూ, అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులందరికి చేరాలనే మళ్లీ విడుదల చేస్తున్నారు.
 
 ఈ సందర్భంగా  రచన,దర్శక నిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. "అదుపు త‌ప్పుతున్న నేటి త‌రానికి అవ‌గాహ‌న కోసం చ‌క్క‌టి సినిమా అందిస్తున్నాం. ఉత్త‌మ పౌరులుగా ఉండాల్సిన వారు స్మార్ట్‌ఫోన్‌కు, నాయకుల పంచే మందు, డ‌బ్బుల‌కు ఎలా బానిస అవుతున్నారో ఆలోచింప‌చేసేలా  సినిమా తెర‌కెక్కించాము. ఒకప్పుడు సినిమాలు జనాన్ని ఆలోచింప చేసే విధంగా ఉండేవి.  కంటి చూపుతో విమానం కూలటం, రక్త పాతం, హింస, బీపీలు పెరిగే సౌండ్ అర్ధం లేని సినిమాలు వేల కోట్ల కలెక్షన్స్. సమాజానికి,రేపటి తరానికిఎలాంటి  నేప‌థ్యమో ఆలోచించండి.మీ కోసం.... ఈ నెలలో విడుదల అవుతున్నజనం సినిమా చూడండి.. ఓటీటీకి ప్లాన్ చేయ‌డం లేదు. ఈ సినిమాకు సుమ‌న్ గారే హీరో. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించారు. ఇందులో క‌మ‌ర్షియ‌ల్ అంశాలు, సందేశం, సెంటిమెంట్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మే 29న థియేటర్ లకు వెళ్లి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments