Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు

Advertiesment
K.S. Rama Rao

దేవీ

, గురువారం, 15 మే 2025 (16:24 IST)
K.S. Rama Rao
ఈమధ్య సినిమా తీశాక థియేటర్లలో రిలీజ్ చేస్తే చూసేందుకు ప్రేక్షకుడు కానరావడంలేదు. ఏవో కొన్ని సినిమాలు మినహా చిన్న సినిమాలకు అస్సలు జనాలు లేక వెలవెల బోతున్నాయి. అందుకే సినిమా పరిశ్రమ బతకాలంటే దిల్ రాజు, మైత్రీమూవీస్ వంటి పెద్ద సంస్థలు, ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి సంయుక్తంగా చర్చలు జరిపి థియేటర్ లో రెంటల్ సిస్టమ్ ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత కె.ఎస్.రామరావు తెలియజేశారు. ఈరోజు వచ్చనవాడు గౌతమ్ సినిమా టీజర్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.
 
కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, పర్సెంటేజ్ సిస్టమ్ మంచిదే. అలా వుంటేనే థియేటర్లు బాగుంటాయి. అవి బాగుంటేనే ప్రొడక్షన్ బాగుంటుంది. అప్పుడే సినిమా బతుకుతుంది. లేదంటే థియేటర్ కు రెంట్ కట్టలేక తీసేయాల్సివచ్చేస్తుంది. ప్రేక్షకులు కూడా ఓటీటీలో కాకుండా థియేటర్ లో సౌండ్ కానీ ఇమేజ్ ను కానీ చూసి ఎంజాయ్ చేయండి. సినిమాను కక్కుర్తిగా ఓటీటీలో చూడకండి. మన పూర్వీకులు నుంచి ఇప్పటివరకు థియేటర్ల కోసమే సినిమా తీసేవారు. కానీ ఇప్పుడు కలెక్టన్ పేరిట అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. 
 
నిర్మాతలు కొంతమంది సిండికేట్ గా ఏర్పడటటం మంచిదే. అందుకే ఛాంబర్, కౌన్సిల్ కూడా కలిసి కూర్చుని చిన్న సినిమాలను బతికించండి. అందరూ చూస్తేనే పెద్ద సినిమా అవుతుంది అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు