Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

Advertiesment
Ashwin Babu

దేవీ

, సోమవారం, 7 ఏప్రియల్ 2025 (16:13 IST)
Ashwin Babu
మెడికల్ యాక్షన్ మిస్టరీ గా 'వచ్చినవాడు గౌతమ్' చిత్రం రూపొందుతోంది. మెడికల్ ఫీల్డ్ లో వుండే మరో కుంభకోణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్నాడు. మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు.  గోల్డ్ లైన్ క్రియేషన్స్, ప్రవల్లిక యోగి కో - ప్రొడ్యూసర్.
 
నేడు ఈ చిత్రంలో హీరో బ్లెడ్ అండ్ స్టెత్ తో ఉన్న అశ్విన్ బాబు లుక్ ను విడుదల చేశారు. డాక్టర్ యాక్ష న్ కూడా చేయనున్నాడని తెలుస్తోంది. మెడికల్ మాఫియాలో వుండే కొత్త కోణం ఇందులో ఆవిష్కరించనున్నారు. సాయి రోణక్ కేమియో పాత్ర లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రంలో అశ్విన్ బాబు తో పాటు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్,   ఖేడేకర్, అభినయ,  అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, M R వర్మా ఎడిటర్. సురేష్ భీమగని ఆర్ట్ డైరెక్టర్  గా పని చేస్తున్నారు.
 ఈ చిత్రం 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. బేలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, పూర్తి చేసుకుని, త్వరలో మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి