Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.. అకీరాపై మెగాస్టార్ ట్వీట్

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (17:27 IST)
Akira_megastar
టాలీవుడ్ సెలెబ్రిటీలు అల్లు అర్జున్, అఖిల్, అకీరాలకు నేడు పుట్టినరోజు. వీరి పుట్టిన రోజును పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులు, ఫ్యాన్స్ వారికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌లో ఈ ముగ్గురి పుట్టినరోజు ట్రెండింగ్ అయి కూర్చుంది. అల్లు, మెగా, అక్కినేని ఫ్యాన్స్.. తమ అభిమానులైన ఈ ముగ్గురికి నటులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా అకీరా నందన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అకీరా నందన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ ప్రత్యేకంగా స్పందించారు. ఈ బుధవారం పవన్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ పుట్టిన రోజు కావడంతో.. ఇటీవలే సోషల్ మీడియా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అకీరా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించాడు. ఇప్పటికే మెగాప్టార్ యంగ్ హీరోలకి మించి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటూ వరుస ట్వీట్లతో అదరగొడుతున్నారు. ప్రతీ విషయంలో స్పందిస్తూ అందరూ స్పందించేలా చేస్తున్నారు.
 
అలాగే అకీరా నందన్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ ట్వీట్ చేశారు. మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు. (6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే  మించిపోవాలి. Wish you a "Power"ful future. Happy Birthday Akira!.. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ్ముడు బిడ్డకు అన్నయ్య ఆశీస్సులు లభించడంతో పవర్, మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్‌కు కూడా మెగాస్టార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments