Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలి' ... అకీరాకు చిరు విషెస్

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (16:49 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్‌ల సంతానం 'అకీరానందన్'. ఈ కుర్రోడి పుట్టినరోజు వేడుకలు ఏప్రిల్ 8వ తేదీన జరుగుతాయి. ఈ సందర్భంగా అకీరాకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. చిరంజీవి చేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్‌ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. అటు పవర్ స్టార్ అభిమానులు కూడా మురిసిపోతున్నారు. 
 
'మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి. విష్ యూ ఏ పవర్‌ఫుల్ ప్యూచర్. హ్యాపీ బర్త్ డే అకీరా' అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. 
 
అంతేకాకుండా అకీరాను ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చిరంజీవితో పాటు మెగా కుటుంబసభ్యులు, మెగా ఫ్యాన్స్‌ కూడా అకీరాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 
కాగా, భార్యాభర్తలుగా పవన్, రేణులు విడిపోయినప్పటికీ తన తండ్రిని చూడటానికి అకీరా అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తుంటారు. అంతేకాకుండా పెద్దనాన చిరంజీవి ఫ్యామిలీతో కూడా ఈ లిటిల్‌ పవర్‌స్టార్‌కు మంచి బాండింగ్‌ ఉంది. 16 యేళ్ల అకీరా ఇప్పటికే మలయాళం చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments