Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి "విశ్వంభర"లో హీరోయిన్‌గా చెన్నై చంద్రం

ఠాగూర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (13:16 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం "విశ్వంభర". ఈ చిత్రం కోసం హీరోయిన్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది. గత యేడాది దసరా పండుగ రోజున ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. "విశ్వానికి మించి.." అంటూ ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుంది. చిత్ర బృందంతో చిరంజీవి జాయిన్ అయ్యారు. తాజాగా హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. 
 
నిజానికి ఈ చిత్రంలో చిరంజీవి సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వచ్చాయి. వాటికి చెక్‌ పెడుతూ స్టార్ హీరోయిన్ త్రిషను ఖరారు చేసింది చిత్రబృందం. ఆమె 'విశ్వంభర' సెట్‌లోకి అడుగుపెడుతోన్న వీడియోను పంచుకొని నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని కన్ఫామ్‌ చేసింది. 
 
2006లో విడుదలైన 'స్టాలిన్‌'లో చిరు - త్రిషల జోడి వినోదాన్ని పంచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించనున్నారు. దీంతో మెగా అభిమానులు సంబరపడుతున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఇది రూపుదిద్దుకుంటుంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతోంది. దీని కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. 
 
2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది రానుంది. దీనితో పాటు చిరంజీవి తన కుమార్తె సొంత నిర్మాణ సంస్థ 'గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌'పై 157వ సినిమా చేయనున్నారు. అలాగే హరీశ్‌ శంకర్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments