మెగాస్టార్ దూకుడు - "వాల్తేరు వీరయ్య"గా చిరంజీవి

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (22:29 IST)
మెగాస్టార్ చిరంజీవి మంచి దూకుడు మీదున్నారు. ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లలోకి "ఆచార్య"గా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా తనయుడు రాం చరణ్ కూడా నటించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అబౌ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
ఇపుడు "ఆచార్య" సంగతి పక్కనబెడితే చిరంజీవి తన కొత్త చిత్రం టైటిల్‌ను లీక్ చేశారు. బాబీ దర్శకత్వంలో నటించనున్నారు. మెగా 154 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రానికి "వాల్తేరు వీరయ్య" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వెల్లడించారు. 
 
విశాఖపట్నం నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో మెగాస్టార్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైన్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. ఇందులో మరో హీరో రవితేజ కూడా కీలక పాత్రను పోషించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 
 
ఇదిలావుండగా, చిరంజీవి చేతిలో ఇపుడు 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' చిత్రాలు ఉన్నాయి. వీటిలో 'గాడ్ ఫాదర్' ఈ యేడాదే విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments