ఈరోజే విడుదలైన చిరంజీవి చిత్రం ఆచార్య సినిమా చూశాక ప్రేక్షకులు ఎక్కువభాగం బాలకృష్ణ అఖండతోనే పోలుస్తున్నారు. అందులో వున్న చాలా అంశాలు ఇందులో వుండడం విశేషం. ప్రధానమైంది ధర్మాన్ని నిలబెట్టడమే. ధర్మం గాడి తప్పితే శివుని అంశ అఘోరా వచ్చి ఎలా పరిష్కరించింది అనేది అఖండ సారాంశం.
ఇక చిరంజీవి ఆచార్య కూడా సేమ్‌టుసేమ్. కాకపోతే బ్యాక్‌డ్రాప్ నగ్జలైట్ అనే అంశం మాత్రమే. ఈ రెండు సినిమాల్లో పోలికలు చూద్దాం. కామన్ అంశం మైనింగ్ మాఫియా. అఖండలో హీరో ఎలివేషన్ సీన్స్ బాగా పండాయి. అదే కొరటాల శివ.. చిరంజీవితో ఎలివేషన్స్ సీన్స్ తెరకెక్కించడంలో ఫెయిలయ్యాడు. అందుకు చిరంజీవిలో ఫెరోషినెస్ లేకపోవడమే. చాలా కూల్‌గా నింపాదిగా ఆయన నటించారు. కానీ బాలకృష్ణ అఘోరా పాత్రలో పిల్లల్ని సైతం భయపెట్టడంతోపాటు మెప్పించాడు. అయితే ఆచార్య మే లోనే విడుదల కావాల్సి వుంది. అదే నెలలో అఖండ అనుకున్నారు. కానీ కోవిడ్ ఈ రెండు సినిమాలను వాయిదా వేసేలా చేసింది.
ఇక ద్వితీయార్థంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలన్నీ అఖండ సీన్స్‌ను గుర్తుచేస్తాయి. ముఖ్యంగా మైనింగ్ మాఫియా నేపథ్యంలో అది కనిపిస్తుంది. అఖండలో శివుని నేపథ్యం అయితే ఇందులో అమ్మవారి నేపథ్యం. శివుని నేపథ్యం కూడా వున్నా అది లాహే.. అనే పాట వరకే పరిమితం చేశారు. క్లయిమాక్స్‌లో కెజిఎఫ్.2 ఛాయలు కూడా కనిపిస్తాయి.
ఆచార్య రిలీజ్‌కుముందు ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు కథ గురించి చెబితే, ఇప్పటికే అఖండలో చూపించేశారు కదా. దర్మం గాడితప్పితే దైవదూతగా అఘోరాగా వస్తాడు. మరి ఆచార్యలో నగ్జలైట్ వస్తారా! అన్న ఓ విలేకరి ప్రశ్నకు దర్శకుడు కొంత తడబాటు పడ్డా, చిరంజీవి కలుగజేసుకుని దైవం మానుష రూపేణ అంటూ నగ్జలైట్ రూపంలో వస్తాడంటూ వివరించారు. ఫైనల్‌గా సినిమా చూస్తే.. అలానే వుంది. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్లు.. సేమ్ టు సేమ్. సింహం గెడ్డం గీసుకోదు. నేను గీసుకుంటానంటాడు. ఆచార్య సినిమా కూడా అలానే వుంది.