Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌!

Advertiesment
Chiranjeevi, Pawan Kalyan, Ramcharan
Chiranjeevi, Pawan Kalyan, Ramcharan
మెగాస్టార్ ఫ్యామిలీనుంచి చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన సినిమా `ఆచార్య‌`. ఈ సినిమా ఈనెల 29న విడుద‌ల‌కాబోతోంది. అయితే చిత్ర ప్ర‌మోష‌న్‌లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సిద్ధ పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తే బాగుండేది. కానీ కుద‌ర‌లేదు. అంటూ చిరంజీవి చెప్పాడు. దీనికి రామ్ చ‌ర‌ణ్ మాత్రం నాన్న‌, బాబాయ్ తో క‌లిసి న‌టించే ఛాన్స్ లేక‌పోలేద‌ని హింట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన క‌థ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.
 
ముగ్గురు క‌లిసి న‌టిస్తే ప‌వ‌ర్‌ఫుల్ కాంబినేష‌న్‌. క‌థ కుదిరితే వెంట‌నే సెట్‌పైకి వెళ‌తాం. నేనే నిర్మాత‌గా వుంటాను అని క్లారిటీ ఇచ్చాడు. బాబాయ్ బేన‌ర్‌లోకూడా చేసే ఆలోచ‌న వుంద‌ని తెలిపారు. ఇక మెగా   అభిమానులు ఈ మ‌గ్గురిని క‌లిపే ఎలా వుంటుంద‌నే ఆలోచ‌న‌లో సోష‌ల్ మీడియాలో ఓ స్టిల్‌ను పోస్ట్ చేశారు. న‌గ్జ‌లైట్ గెట‌ప్‌లో వున్న చిరంజీవి, చ‌ర‌ణ్ ప‌క్క‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ వున్న‌ట్లు పెట్టి వైర‌ల్ చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేజీఎఫ్-3లో యష్, బాహుబలి.. ఎక్కడ నుంచి మొదలవుతుందో..?