Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ - భూమిక "ఖుషీ"కి 21 యేళ్లు

Advertiesment
Pawan Kalyan-Bhumika
, బుధవారం, 27 ఏప్రియల్ 2022 (09:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక కాంబినేషన్‌లో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఖుషీ". ఈ చిత్రం విడుదలై మంగళవారానికి (ఏప్రిల్ 26)కు 21 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లా తన ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రంలోని ఓ స్టిల్‌ను షేర్ చేసి, తన ఆనందాన్ని పంచుకున్నారు. 
 
ఈ చిత్రంలో మధుగా తనకు వచ్చిన గుర్తింపును ప్రధానంగా ప్రస్తావించారు. తనకు జోడీగా నటించిన పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు ఎస్.జే.సూర్య, నిర్మాత ఏఎం రత్నంలకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
కాగా, ఇది భూమిక చావ్లాకు తన కెరీర్‌లో రెండో చిత్రమే. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. అటు పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, భూమికకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత్ర న‌చ్చితే ఎక్స్‌పోజింగ్ రెడీ అంటున్న‌ రుహానీ శర్మ!