Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న‌ నయనతార

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (15:42 IST)
chiru - Nayanatara
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే ప‌వ‌ర్‌ఫుల్‌ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోన్నారు.  
 
నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ముఖ్య ప్రకటన చేశారు. గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. సైరా చిత్రంతో చిరంజీవి నయనతార అందరినీ మెప్పించారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.
 
మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు తగినన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమా కోసం సాంకేతిక పరంగా అత్యున్నత స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.
 
మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అద్భుత‌మైన‌ సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
 
కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్ఫణ: కొణిదెల సురేఖ
బ్యానర్స్: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం: ఎస్ఎస్ తమన్
సినిమాటోగ్రఫర్: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాఘవన్
ఎక్స్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments