Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" ముంగిట మరో రికార్డు - 10 వేల స్క్రీన్లలో రిలీజ్?

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (13:03 IST)
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా, రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ మూవీపై మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 'బాహుబలి' సినిమాల తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో పాటు తొలిసారిగా ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాకి ఇంత భారీ హైప్ రావడానికి కారణం.

జ‌న‌వ‌రి 7న విడుదల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్రం నుండి పోస్ట‌ర్స్, వీడియోలు విడుద‌ల చేయ‌గా వాటికి భారీ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగాయి.

అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త అంద‌రిలో ఆస‌క్తి క‌లిగిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 స్క్రీన్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది. అందుకు తగిన విధంగా నిర్మాత, సినిమా పంపిణీదారుడైన దిల్ రాజు దృష్టిసారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments