Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారీ సెట్‌లో ఆరంభించిన చిరంజీవి భోళా శంకర్ షూటింగ్

Advertiesment
భారీ సెట్‌లో ఆరంభించిన చిరంజీవి భోళా శంకర్ షూటింగ్
, సోమవారం, 15 నవంబరు 2021 (16:41 IST)
chiru-KR-Ramesh-satynandh
మెగాస్టార్ చిరంజీవి ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఘనంగా  నిర్వహించారు.  
 
- సోమవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. హైద‌రాబాద్ శివార్లో  ఏస్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి మీద ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
 
భోళా శంకర్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. టైటిల్ పోస్టర్, రాఖీ పండుగ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్‌లో చూపించబోతోన్నారు.
 
అద్భుతమైన కథకు.. మరింత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైంది. చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. కీర్తి సురేష్ ఆయన చెల్లిగా కనిపించనున్నారు. పక్కా కమర్షియల్‌గా ఈ చిత్రం ఉండబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్ట‌ర్ బెగ్గ‌ర్ గా సంపూర్ణేష్ బాబు