Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క‌ష్ట‌ప‌డే త‌త్త్వంతో కొత్త‌త‌రం ముందుకు సాగాలి - మెగాస్టార్ చిరంజీవి పిలుపు

క‌ష్ట‌ప‌డే త‌త్త్వంతో కొత్త‌త‌రం ముందుకు సాగాలి - మెగాస్టార్ చిరంజీవి పిలుపు
, శుక్రవారం, 12 నవంబరు 2021 (16:18 IST)
koti-Manisarma-chiru and others
సినీ ఇండస్ట్రీకు కొత్త తరం రావాలి. వచ్చి ఇండస్ట్రీలో మాలాంటి పెద్దల అనుభ‌వాల‌తో సలహాలు తీసుకోవాలి. ఇండస్ట్రీ ఎప్పుడూ ఇలాగే కొత్త‌ద‌నంతో సాగి పోవాలని కోరుకుంటున్నాను` అని మెగాస్టార్ చిరంజీవి  అన్నారు. 
 
సంగీత ద‌ర్శ‌కుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్ గా న‌టించిన సినిమా "11:11.  కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మించిన ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లో జ‌రిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు టైగర్ హిల్స్ ప్రొడక్షన్, బ్యానర్ ను, చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
 
అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఈ రోజు చాలా మంచి రోజు. నా మరో సినిమా 'బోలా శంకర్' కూడా ఈ రోజు ప్రారంభం కాబడింది. నిన్న అర్ధ రాత్రి వరకు కూడా నేను కోటి గారు ఇంట్లోనే షూటింగ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం కోటి గారు. ఎందుకంటే కోటి తో నాకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి అన్ని రకాల హంగులతో ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని సంగీతం అందించాడు. 80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు, లాంటి సినిమాలు 12 వరకు చేయడం జరిగింది. సుమారు 60 సాంగ్స్ అంటే నాకు 90% సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చినటువంటి కోటి గారి ఋణం తీర్చుకోలేక పోయానే అనే బాధ ఉండేది. కానీ ఈ రోజు కోటి గారి కొడుకు రాజీవ్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం వేసింది.
 
ఇద్దరు కొడుకులలో ఒకరిని సంగీత దర్శకుడిగా మరొకరిని నటుడుగా  పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా తను ప్లాన్ చేసుకున్నాడు.. ఈనాడు సినిమా ఇండస్ట్రీ వండర్ఫుల్ ఇండస్ట్రీ కొత్త వాళ్లు ఇండస్ట్రీకి వస్తానంటే నేను గ్రాండ్ గా వెల్ కమ్ చెప్తాను. సినీ కళామ తల్లిని నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా చెడిపోలేదు. వచ్చిన వారంతా కూడా మొదటగా కష్టాన్ని నమ్ముకుని పని చేస్తూ నిజాయితీగా ఉండాలి. అలా ఉన్న వారికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది.అలా నేను కూడా కష్టపడుతూ రావడం వలనే ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇండస్ట్రీ లో జయాపజయాలు అనేవి సహజం వాటిని పక్కన పెట్టి మన కష్టాన్ని నమ్ముకొని సిన్సియర్ గా పనిచేస్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలాగే ఈ సినిమాలో ప‌నిచేస్తున్న అంద‌రికీ స‌క్సెస్ రావాల‌ని ఆకాంక్షించారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు కోటి మాట్లాడుతూ,  రాజీవ్ ని ఆశీర్వ‌దించ‌డానికి చిరంజీవి గారు అయ్యప్ప మాల లో రావడం మా రాజీవ్  అదృష్టమని భావిస్తున్నాను. ఎంతో క్రమశిక్షణతో చిత్తశుద్ధితో చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవలను అందించారు సాలూరు రాజేశ్వరరావు గారి తనయుడు గా అదే కోవలో నేను కూడా అదే క్రమశిక్షణతో చిత్తశుద్ధితో అంకితభావంతో చలన చిత్ర పరిశ్రమకు సేవలను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే కోవలో మరి మా రాజీవ్ కూడా చలనచిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతలతో చక్కగా రాణిస్తూ. అన్ని విధాలుగా వారికి కోపరేట్ చేస్తూ పని చేయాలని మా నాన్న గారి ఆశీస్సులతోటి ,తాత గారి ఆశీస్సులతో మంచి కళాకారుడు అవుతాడని భావిస్తున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాత వీరేశ్ (బళ్లారి )మాట్లాడుతూ, కష్టపడితే ఏదైనా సాధించగలం అనే దానికి మెగాస్టార్ చిరంజీవి గారు నిదర్శనం.తను ఎంతో బిజీ షెడ్యూల్ వున్నా కూడా మా బ్యానర్ ను,చిత్రాన్ని ఆశీర్వదించదానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాకు మంచి సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుదు మణిశర్మకి నా ధన్యవాదాలు. ఇకనుండి తమ సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి  సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ఆన్నారు.
 
చిత్ర దర్శకుడు కిట్టు నల్లూరి మాట్లాడుతూ ..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు మెగాస్టార్ సపోర్ట్ లభించడం మా అదృష్టం.. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సంగీత దిగ్గజం మణిశర్మ అందిస్తున్న సంగీతం మేజర్ అసెట్ కానుంది. ఈ చిత్రంలో రాజీవ్ సాలూర్ నటన హైలైట్ కానుందని అన్నారు.మా చిత్ర నిర్మాత ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు.థ్రిల్లర్ జోనర్ లి వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
 
 హీరో రాజీవ్ సాలూరు మాట్లాడుతూ .. చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ మా చిన్న ఈవెంట్ కు వచ్చి మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.
 
 హీరోయిన్ వర్షా విశ్వనాథ్ మాట్లాడుతూ..మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చి నందుకు ధన్యవాదాలు.ఇంత పెద్ద సీనియర్ నటుల మధ్య నేను సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కె.సి.ఆర్‌. బ‌యోపిక్‌గా తెలంగాణ దేవుడు - రివ్యూ