Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కె.సి.ఆర్‌. బ‌యోపిక్‌గా తెలంగాణ దేవుడు - రివ్యూ

కె.సి.ఆర్‌. బ‌యోపిక్‌గా తెలంగాణ దేవుడు - రివ్యూ
, శుక్రవారం, 12 నవంబరు 2021 (15:55 IST)
Telangana Devudu
తెలంగాణ రాష్ట్రంను స్థాపించేలా పోరాటం చేసిన కె.చంద్ర‌శేఖఖ‌ర్ రావు జీవిత చ‌రిత్ర‌లోని అంశాల‌ను తీసుకుని  తెలంగాణ దేవుడు చిత్రం రూపొందింది. క‌రోనాకు ముందుగానే ఈ సినిమాను తెర‌కెక్కించినా అనివార్య కార‌ణాల‌వ‌ల్ల వాయిదా ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. దాదాపు 200 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసిన‌ట్లు ద‌ర్శ‌కుడు వడత్యా హరీష్ తెలియ‌జేశారు. 
 
శ్రీకాంత్ కె.సి.ఆర్‌.గా న‌టించ‌గా జిషాన్‌ ఉస్మాన్ చిన్న నాటి కె.సి.ఆర్‌.గా న‌టించాడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత.
మిగిలిన పాత్ర‌ల్లో సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.
 
కథ: 
విజయ్ దేవ్ (జిషాన్ ఉస్మాన్ చిన్నప్పుడు నుంచి చురుకైన విద్యార్థి. కాలేజీ వ‌య‌స్సు వచ్చాక‌ తెలంగాణ గురించి ప‌లు ర‌కాలుగా పోరాట‌లు చేస్తున్న విష‌యాన్ని గ‌మనిస్తుంటాడు. అలా ఉద్య‌మం ఒక రూపు రావ‌డానికి పెద్ద కె.సి.ఆర్‌. (శ్రీకాంత్) ఎటువంటి ప్ర‌య‌త్నం చేశాడు? అందుకు  దారి తీయడానికి గల కారణాలేంటి? ఆ త‌ర్వాత రాష్ట్రంలోని ప్ర‌జ‌ల్ని ఎలా చైద‌న్య‌వంతుల్ని చేశాడు? ఈ క్ర‌మంలో పోలీసు యంత్రాంగం, రాజ‌కీయ నాయ‌కులు, అధికార పార్టీవారు ఏవిధంగా అడ్డుకున్నారు?  పోరాటం స‌మ‌యంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఏమి హామీ ఇచ్చారు? అనంత‌రం ప‌రిస్థితులు ఏవిధంగా మారాయి? ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ దేవ్ బంగారు తెలంగాణను సాధించాడా? అనేది తెర‌పై చూడాల్సిందే.
 
 విశ్లేషణ: 
 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రపై ప‌లు సినిమాలే వచ్చాయి. ఉద్యమం సమయంలో జగపతిబాబు ప్రధాన పాత్రలో 'జై భోలో తెలంగాణ' సినిమా వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆ త‌ర్వాత మ‌రో సినిమా వ‌చ్చింది. కానీ కె.సి.ఆర్‌. సెమీ బ‌యోపిక్‌గా సినిమా రావ‌డం తొలి ప్ర‌య‌త్నం. ఇందులో తెలంగాణ పోరాటంతోపాటు ఆంధ్ర పాల‌కులు, ప‌రిస్థితులను ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించాడు. 1956లో ఆంధ్రప్రదేశ్ గా కొత్త రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తరువాత   మళ్లీ ప్రత్యేక తెలంగాణ కోసం  1969 లో మళ్ళీ ఉద్యమం మొదలు కావడం  లాంటి ఘట్టాలను మరోవైపు చూపిస్తూ ఎక్కడా బోరింగ్ లేకుండా దర్శకుడు సినిమాను తెరపై ఆవిష్కరించారు. 
తెలుగుదేశం పార్టీని వదిలి తెలంగాణ సాధన కోసం. ఉద్యమ పార్టీని స్థాపించి  ఆ తరువాత రాజకీయ పార్టీగా తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగి విధానం చూపారు. కేంద్రంలో ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు, అక్క‌డి కోట‌రీ ఏవిధంగా కె.సి.ఆర్‌.కు ఇచ్చిన హామీని మ‌ర్చిపోయార‌నేది క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపాడు. ఆ త‌ర్వాత ఒంట‌రిగా పార్టీపెట్టి విజ‌యాన్ని సాధించి ముఖ్య‌మం్ర‌తి అయినంత‌వ‌ర‌కు క‌థ వుంది.  
 
కేసీఆర్‌ చిన్నతనం నుంచి  తన కాలేజ్ లైఫ్ వ‌ర‌కు పోషించిన పాత్ర ఉస్మాన్ బాగానే చేశాడు. అయితే పెద్ద‌య్యాక శ్రీ‌కాంత్ పోషించినా ఆయ‌న‌కు త‌గిన‌విధంగా లేడ‌నేది వాస్త‌వం. కె.సి.ఆర్‌. బ‌యోపిక్‌గా తీసిన‌ప్పుడు పాత్ర‌ను కూడా సీరియ‌స్‌గా ఆలోచించాలి. కేవ‌లం వాణిజ్య‌ప‌రంగా శ్రీ‌కాంత్ అయితేనే బాగుంటుంద‌నే కోణంలో చేసిన‌ట్లుంది. కె.సి.ఆర్‌. డిక్షన్ కొంత‌వ‌ర‌కు చేసినా కృతంగా అనిపిస్తుంది. 
అయితే ఉద్య‌మం స‌మ‌యంలో సాగిన పాట‌లు, సాహిత్యం ఆక‌ట్టుకునేలా వుంది. కానీ కెసిఆర్‌.ను డ్యూయెట్ లతో ఓ కమర్షియల్ బయోపిక్‌లా తెరకెక్కించారు. ఇందుకు ద‌ర్శ‌కుడు పూర్తి స్వేచ్ఛ తీసుకున్నాడు.  
కె.సీఆర్ భార్య పాత్రలో సంగీత,. కవిత పాత్రలో మధుమిత హరీష్ రావు పాత్రలో అజయ్, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రలో సుమన్, రాజశేఖర్ రెడ్డి పాత్రలో కాశీ విశ్వనాథ్, జగన్ పాత్రలో సునీల్, జానారెడ్డి పాత్రలో పృథ్వి  తదితరులు నటించి మెప్పించారు. 
 
ముఖ్యంగా రోశయ్య పాత్ర ను పోషించిన జ‌బ‌ర్‌ద‌స్త్ సురేష్ బాగా న‌టించాడు. ఈ చిత్రానికి సంగీతం బాగా కుదిరింది. ఎడిటింగ్ బాగుంది. విజ‌య్ కుమార్  సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. తొలి చిత్ర‌మైనా నిర్మాత నిర్మాణ విలువలు ఉన్నతంగా చూపారు. క‌మ‌ర్షియ‌ల్‌గా ఎటువంటి స‌క్సెస్ సాధిస్తుంద‌నేది అంచ‌నావేయ‌డ‌కంటే ఈ సినిమా బంగారు తెలంగాణ కోసం కె.సి.ఆర్‌. త‌పించిన విధానం న‌చ్చి అభిమానిగా ద‌ర్శ‌క నిర్మాత‌లు తీసిన సినిమా. అక్క‌డ‌క్క‌డా కొన్ని లోపాలున్నా రొటీన్ క‌థ‌ల‌కు భిన్నంగా కె.సి.ఆర్‌. బ‌యోపిక్ అనే మొద‌టి సినిమాకు ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది.
రేటింగ్: 3.5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాసన గారూ గుడ్ న్యూస్ ఎప్పుడు.. షాకింగ్ యాన్సర్