పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఈ వేడుకలను పీకే ఫ్యాన్స్ ఆయన అభిమానులు పండుగలా జరుపుకున్నారు. అలాగే, పీకేకు పలువురు సినీ ప్రముఖులు, నేతలు పుట్టినరోజు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఈ వేడుకలను పీకే ఫ్యాన్స్ ఆయన అభిమానులు పండుగలా జరుపుకున్నారు. అలాగే, పీకేకు పలువురు సినీ ప్రముఖులు, నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, చిరంజీవి కూడా పవన్‌కు పుట్టిన రోజు నాడు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో తమ్ముడు ఉబ్బితబ్బిబ్బులై.. చిన్నపిల్లోడిలా మారిపోయాడు.
నిజానికి చిరంజీవి .. పవన్ కల్యాణ్ మధ్య మనస్పర్థలు ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. అయితే అవి రాజకీయపరమైన అభిప్రాయభేదాలే తప్ప, వాళ్లిద్దరి అనుబంధానికి సంబంధించినవి కావనే విషయం చాలాసార్లు స్పష్టమైంది. ఇక పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో అభిమానుల నుంచి గ్రీటింగ్స్ అందుకుంటూనే, శనివారం కూడా త్రివిక్రమ్ మూవీ షూటింగులో పవన్ పాల్గొంటున్నారు.
అయితే, బర్త్‌డే బాయ్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, చిత్ర యూనిట్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ చిరంజీవి దంపతులు షూటింగ్ స్పాట్‌లో ప్రత్యక్షమయ్యారు. అన్నావదిలను చూడగానే పవన్ ఆనందంతో పొంగిపోయారు. చిరూ దంపతులు పవన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నావదినల నుంచి పవన్ ఆశీస్సులు అందుకున్నారు. చిరు జంట రాకతో చిత్ర సెట్‌లో పండుగ వాతావరణం నెలకొంది.