Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఇంటి కోడలైనందుకు గర్వంగా ఉంది : ఆ 'పిక్‌'పై ఉపాసన కామెంట్స్

అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనుమరాలు ఉపాసన... ఇపుడు మెగాస్టార్ చిరంజీవి ఏకైక కుమారుడు రాంచరణ్ తేజ్ సతీమణి. దీంతో ఆమె కొణిదెల ఇంటికి కోడలయ్యారు. అయితే, శనివారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పు

Advertiesment
ఆ ఇంటి కోడలైనందుకు గర్వంగా ఉంది : ఆ 'పిక్‌'పై ఉపాసన కామెంట్స్
, శనివారం, 2 సెప్టెంబరు 2017 (12:54 IST)
అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనుమరాలు ఉపాసన... ఇపుడు మెగాస్టార్ చిరంజీవి ఏకైక కుమారుడు రాంచరణ్ తేజ్ సతీమణి. దీంతో ఆమె కొణిదెల ఇంటికి కోడలయ్యారు. అయితే, శనివారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఆమె అత్యంత అరుదైన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి కింది ఆమె చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకర్షిస్తోంది.
 
నిజానికి మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి - ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నంటే త‌మ్ముడికి ప్రాణం. త‌మ్ముడు అంటే అన్న‌కు అమితాభిమానం. తమ్ముడిపై పితృవాత్స‌ల్యం చూపిస్తారు అన్నయ్య. ఇక అన్న‌ను దేవుడిగా కొలుస్తారు త‌మ్ముడు. 
 
అన్న‌ద‌మ్ముల పొలిటిక‌ల్ ఎంట్రీ త‌ర్వాత మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డినా.. ఆ ఇద్ద‌రిమ‌ధ్యా ఆత్మీయానుబంధం గొప్ప‌ది అని నిరూప‌ణ అయిన సంద‌ర్భాలున్నాయి. ఇదిగో ఈ ఫోటో చూశాక అన్న‌ద‌మ్ముల అనుబంధంపై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది. ఈ రేర్ పిక్‌ని మెగా కోడ‌లు ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌కు షేర్ చేసుకున్నారు.
 
"మిస్ట‌ర్ సి (చిరంజీవి).. సామాజిక మాధ్య‌మాల్లో దొర‌క‌డం క‌ష్ట‌మే. త‌న‌వంతుగా నేను ఈ ఫోటోని షేర్ చేస్తున్నా.. కొణిదెల కుటుంబీకురాలిని అయినందుకు గ‌ర్వంగా ఉన్నా.." అంటూ ట్వీట్ చేశారు. అన్న‌ద‌మ్ములే తండ్రికుమారులు.. అన్న అర్థాన్నిచ్చే ఈ రేర్ ఫోటో మెగాభిమానుల‌కు వెల్ ట్రీట్ అనే చెప్పాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బర్త్‌ డే' శుభవార్త : మళ్లీ తండ్రికాబోతున్న పవర్ స్టార్