'హ్యాపీ బర్త్ డే టు పవన్ కళ్యాణ్' : వైరల్‌గా మారిన వారిద్దరి ఫోటో...
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు జరుపుకుంటున్నారు. పవన్ పేరుతో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి అన్నదానాలు చేశారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు జరుపుకుంటున్నారు. పవన్ పేరుతో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి అన్నదానాలు చేశారు.
మరోవైపు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. పైగా పవన్ కళ్యాణ్‌కి ఇది 25వ సినిమా కావడంతో సినిమాపై లెక్కల్లో చూపలేనన్ని అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ని బయటకు విడుదల చేశారు. 'పీఎస్ పీకె#25' టాగ్‌తో ఉన్న ఈపోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్‌మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది.
పోస్టర్‌లో పవన్ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అదే పోస్టర్‌లో పవన్ కోపంతో ఎటో నడిచివెళ్తున్నట్లుగా కూడా చూపించారు. దీంతో పవన్ డిఫరెంట్ లుక్ ఈసినిమాలో కనిపించబోతున్నాడు. పవన్‌కు జంటగా కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ నటిస్తున్న ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు.