Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్.. ''హ్యాపీ బర్త్‌డే పవన్‌ కల్యాణ్'' అనే హ్యాగ్‌ట్యాగ్‌తో?

సామాజిక వెబ్ సైట్లకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులో పీకే ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. అలాంటి పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు సృష్టించార

Advertiesment
ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్.. ''హ్యాపీ బర్త్‌డే పవన్‌ కల్యాణ్'' అనే హ్యాగ్‌ట్యాగ్‌తో?
, శనివారం, 3 సెప్టెంబరు 2016 (12:59 IST)
సామాజిక వెబ్ సైట్లకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులో పీకే ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. అలాంటి పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు సృష్టించారు. పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని ట్విట్టర్లో అరుదైన రికార్డును సృష్టించారు.

భారత్‌లో అతిపెద్ద ట్విట్టర్‌ ఫ్యాన్‌ ట్రెండ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ సాధించుకున్నారు. "హ్యాపీ బర్త్‌డే పవన్‌ కల్యాణ్" అనే ట్విట్టర్‌ హ్యాష్‌ట్యాగ్‌ మీద గత నెలరోజుల్లో ఏకంగా 5.5 లక్షలకు పైగా ట్వీట్లు నమోదయ్యాయట. భారత్‌లో ఇప్పటికే ఇదే రికార్డు. ఇప్పటి దాకా అజిత్ ఫ్యాన్స్ పేరిట ఉండే ఈ రికార్డు ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ వద్దకు వచ్చింది. 
 
అజిత్ సినిమా "ఎన్నై అరిందాల్‌" హ్యాష్‌ట్యాగ్‌కు గతంలో 5.3 లక్షల ట్వీట్లు వచ్చాయి. దాన్ని పవన్‌ ఫ్యాన్స్‌ దాటేశారు. మొత్తంగా పవన్‌ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్‌ మీద ఆయన ఫ్యాన్స్‌ చేస్తున్న ట్వీట్లు ఆరు లక్షలు దాటే అవకాశం ఉంది. 
 
ఇదిలా ఉంటే.. పవన్‌కల్యాణ్‌ రాకతోనే తనకు పునర్జన్మ లభించిందని క్యాన్సర్ నుంచి కోలుకున్న శ్రీజ తెలిపింది. పవన్‌కల్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పింది. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పింది. శ్రీజ పాల్వంచలో తొమ్మిదోతరగతి చదువుతుతోంది. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఖమ్మంలోని కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీజను 2014 అక్టోబర్‌లో పరామర్శించారు. శ్రీజను చూసిన పవన్ కంటతడి పెట్టారు. శ్రీజ పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆపై శ్రీజకు వైద్యం చేయించి, మామూలు మనిషిగా మార్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి అంతటి గొప్ప స్టార్‌ని హేండిల్ చేయలేను మహాప్రభో: అవసరాల శ్రీనివాస్