Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బాహుబలి-2'' రికార్డు గల్లంతు.. ఎలా?

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (15:34 IST)
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "బాహుబలి-2" చిత్రం హిందీలో నెలకొల్పిన రికార్డు మాయమైపోయింది. గత నెల 14వ తేదీన విడుదలైన "ఛావా" చిత్రం ఈ రికార్డును అధిగమించింది. "బాహుబలి-2" చిత్రం బాలీవుడ్‌లో రూ.510 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. 
 
అయితే, "ఛావా" చిత్రం విడుదలైన 25 రోజుల్లోనే రూ.516 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ పాత్రలో జీవించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. ఈ చారిత్రాత్మక చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు, ఆదరణ దక్కించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. 
 
కాగా, "ఛావా" చిత్రం తాజాగా "బాహుబలి-2" రికార్డును క్రాస్ చేసింది. "బాహుబలి-2" కలెక్ట్ చేసిన రూ.510 కోట్లను "ఛావా" చిత్రం కేవలం 25 రోజుల్లోనే రూ.516 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పడం గమనార్హం. ఈ చిత్రం ఓవరాల్‌గా బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ఆరో స్థానంలో నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments