Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జర్నలిస్టు కోర్కె తీర్చమన్నాడు... తమిళ నటి గాయత్రి సాయి

తమిళ సీనియర్ నటి గాయత్రి సాయి ఓ మీడియా జర్నలిస్టుపై లైంగిక ఆరోపణలు చేసింది. తన కుమారుడుకు పాస్ పోర్టు వచ్చేందుకు సాయం చేస్తానని చెప్పి... కోర్కె తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెన్నై నగర పోలీస

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (12:43 IST)
తమిళ సీనియర్ నటి గాయత్రి సాయి ఓ మీడియా జర్నలిస్టుపై లైంగిక ఆరోపణలు చేసింది. తన కుమారుడుకు పాస్ పోర్టు వచ్చేందుకు సాయం చేస్తానని చెప్పి... కోర్కె తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై ఆమె 8 నిమిషాల నిడివి కలిగిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గాయత్రి సాయి అనే నటి తమిళ సినిమాలో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని హాంకాంగ్‌లో స్థిరపడింది. అయితే, ఆమె భర్త 2016లో హాంకాంగ్‌లో చనిపోయారు. అనంతరం ఆమెను సీనియర్ జర్నలిస్టు ప్రకాశ్ ఎం.స్వామి ఆమెను కలిసాడు. 
 
తన కుమారుడికి పాస్‌పోర్టు విషయంలో దరఖాస్తు చేసే నెపంతో తన ఇంటికొచ్చి శారీరకంగానూ వేధించాడని ఆరోపించింది. ఆమె ఆరోపణలను స్వామి ఖండించాడు. తానెప్పుడూ ఆమె ఇంటికి వెళ్లలేదని పేర్కొన్నాడు. ఆమెకు వ్యతిరేకంగా తానో స్టోరీని సిద్ధం చేస్తున్నానని, ఈ విషయం తెలిసే ఆమె తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని వివరించాడు.
 
2016లో హాంకాంగ్‌లో తన భర్త చనిపోయిన తర్వాత తొలిసారి స్వామి తనను కలిశాడని నటి పేర్కొంది. తన కుమారుడికి పాస్ పోర్టు కోసం సాయం చేస్తానని చెప్పడంతో అతడితో టచ్‌లో ఉన్నానని తెలిపింది. అయితే, అతడి ప్రవర్తనలో తేడాను గుర్తించానని, ఇటీవల ఆయన తన ఇంటికి సమీపంలోనే ఇంటిని తీసుకుని తనను వేధించడం మొదలుపెట్టాడని వివరించింది.
 
కాగా, నటిని వేధిస్తున్న ప్రకాశ్ దేశంలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేసినట్టు అతడి ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఐక్యరాజ్య సమితికి కరెస్పాండెంట్‌నని, ఎమ్మీ అవార్డులుకు న్యాయమూర్తిగా ఉన్నానని, అమెరికా తమిళ సంఘానికి అధ్యక్షుడినని అందులో రాసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం