Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

అబ్బ.. ఎంత అందంగా వున్నావే... ఆ సైజులేంటే... మహిళతో సీఐ

పోకిరీల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ పట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. ఫలి

Advertiesment
అబ్బ.. ఎంత అందంగా వున్నావే... ఆ సైజులేంటే... మహిళతో సీఐ
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (09:33 IST)
పోకిరీల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ పట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. ఫలితంగా ఆ సీఐ సస్పెండ్‌కు గురయ్యాడు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుమల వాయల్పాడు పోలీస్‌స్టేషన్‌లో సీఐగా తేజోమూర్తి పని చేస్తున్నాడు. ఈయన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ కేసు విషయంలో కలిసేందుకు వచ్చిన మహిళను గరుడసేవరోజు తిరుమలకు రావాలని, ఆ రోజు మనమిద్దరం కొండపై ఏకాంతంగా గడుపుదామంటూ మహిళకు చెప్పాడు. పైగా, ఆమె శరీరాకృతిపై కూడా కామెంట్స్ చేసినట్టు సమాచారం. 
 
ఈ వ్యవహారంపై బాధిత మహిళ తిరుమలకు వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఆయన మహిళను వేధింపులకు గురిచేసిన వాయల్పాడు సీఐ తేజోమూర్తిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.3 కోట్లకు సిద్ధపడ్డా.. రూ.కోటి ఖర్చుచేసి ప్రణయ్‌ని లేకుండా చేస్తా : మారుతిరావు శపథం