నా మెడలో తాళి కట్టాలని చూశాడు.. నా బిడ్డలే అందుకు సాక్ష్యం: నీలాణి
తమిళనాడు స్టెర్‌లైట్ ఉద్యమంలో పోలీసుల దుస్తుల్లో పాల్గొన్న నటి ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అప్పట్లో ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆపై బెయిల్‌పై విడుదలైన ఆ నటి మళ్లీ సీరియల్ షూటింగ్‌లో బిజీ అ
తమిళనాడు స్టెర్‌లైట్ ఉద్యమంలో పోలీసుల దుస్తుల్లో పాల్గొన్న నటి ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అప్పట్లో ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆపై బెయిల్‌పై విడుదలైన ఆ నటి మళ్లీ సీరియల్ షూటింగ్‌లో బిజీ అయిపోయింది. అయితే మళ్లీ ఆమె వార్తల్లో నిలిచింది.
తనను పెళ్లి చేసుకోవాలని ఓ వ్యక్తి బలవంతం చేస్తున్నాడని తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె బుల్లితెర నటి నీలాణి. నటి టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ పేరు తెచ్చుకుంటున్న తనను ప్రేమ పేరుతో గాంధీ లలిత్‌కుమార్ అనే వ్యక్తి మోసం చేశాడని వాపోయింది.
లిలిత్‌తో పరిచయం ప్రేమ నిజమేనని.. అయితే అతడు చాలామంది మహిళల్ని మోసం చేశాడని తెలుసుకుని దూరమయ్యానని చెప్పింది. తన అనుమతి లేకుండానే తన ఎఫ్‌బీలో తాను పోస్టు చేసినట్లు ఫోటోలు పెట్టేవాడని.. అప్పటి నుంచి మనస్పర్థల కారణంగా కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి.
ఇంకా షూటింగ్ ప్రాంతానికి వచ్చి నానా రభస చేసేవాడని నీలాణి చెప్పింది. ప్రియుడి వేధింపులు భరించలేదని నటి ఆదివారం పోలీసులను ఆశ్రయించి లలిత్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది.
అతడితో తనకు మూడేళ్ల పరిచయం ఉందని, తామిద్దరం ప్రేమించుకున్నామని మనస్పర్థల కారణంగా ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటున్నానని, అతడిని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని.. అయినా పెళ్లి చేసుకోవాలని షూటింగ్ స్పాట్‌కు వచ్చి వేధిస్తున్నాడని నీలాణి తన ఫిర్యాదులో పేర్కొంది. తాను అనాధనని.. తన భర్త పెళ్లయ్యాక పిల్లలను తనను వదిలి వేరొక మహిళతో పారిపోయాడు.
అప్పటి నుంచి పిల్లల కోసం బతుకుతున్నానని నీలాణి చెప్పింది. రెండో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని.. కానీ తన పిల్లలకు, తనకు సేఫ్టీ కోసం లలిత్‌ను పెళ్లాడాలనుకున్నానని.. కానీ అతని ఫోన్‌ను చూడటంతో అతని బుద్ధేంటో తెలిసిందని అప్పటి నుంచి దూరమయ్యానని చెప్పింది.
ఇంటికొచ్చి తన మెడలో తాళి కట్టాలని చూశాడని.. తన బిడ్డలే అందుకు సాక్ష్యమని చెప్పింది. అయితే అతడు ఎలాంటి వాడో లలిత్ స్నేహితులకు, కుటుంబీకులకు బాగా తెలుసునని.. కానీ లలిత్ ఆత్మహత్య చేసుకున్నాడని నీలాణి తెలిపింది.