Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవిత్ర బ్రహ్మోత్సవాల్లో పాడు పని చేసిన సీఐ సస్పెండ్

ఓ వైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు డ్యూటీలో ఉండగా మరోపక్క రాసలీలలు కోసం తహతహలాడిపోయిన వాయల్పాడు సిఐ సిద్ద తేజోమూర్తిని లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. పవిత్ర పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా గరుడసేవ రోజు తిరుమలకు రావాలని ఏకాం

Advertiesment
Sexual Harassment Case
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (13:32 IST)
ఓ వైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు డ్యూటీలో ఉండగా మరోపక్క రాసలీలలు కోసం తహతహలాడిపోయిన వాయల్పాడు సిఐ సిద్ద తేజోమూర్తిని లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. పవిత్ర పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా గరుడసేవ రోజు తిరుమలకు రావాలని ఏకాంతంగా గడుపుదామంటూ బాధిత మహిళ సంయుక్తను సిఐ పలుమార్లు ఫోన్ చేశాడు. 
 
న్యాయం కోసం స్టేషనుకి వెళితే గడిచిన నెలరోజుల నుంచి లైంగికంగా హింసిస్తున్న సిఐ తేజోమూర్తిని రెడ్ హ్యడిండ్‌గా పట్టివ్వటానికి ప్రయత్నించింది సంయుక్త. వివిధ మహిళా సంఘాలు సహాయంతో పక్కా ప్లాన్ చేసింది. విషయం తెలుసుకున్న సిఐ అక్కడి నుండి పారిపోవడంతో బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరించింది.
 
సిఐతో తను వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌తో పాటు పోన్ కాల్ రికార్డును కూడా బహిర్గతం చేసింది. తనలా మరొకరికి అన్యాయం జరగరాదని కోరుకుంది. పవిత్ర బ్రహ్మోత్సవాల్లో డ్యూటీ చేస్తూ పోలీస్ అధికారి ఇటువంటి పాడుపని చేయడం ఏంటని పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రిపుల్ తలాక్‌ ఆర్డినెన్స్‌కు మోదీ సర్కారు ఆమోదం