Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటనకు గుడ్‌బై చెప్పిన టాలీవుడ్ బ్యూటీ?

Webdunia
మంగళవారం, 21 మే 2019 (18:07 IST)
సినీ పరిశ్రమలో హీరోయిన్‌ల కెరీర్ కొంతకాలం మాత్రమే ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. ఇక అవకాశాలు వచ్చినన్ని రోజులు మాత్రం పెళ్లి వంటి పర్సనల్ విషయాలను పక్కన పెట్టి మరీ నటిస్తుంటారు. అలాంటిది 30 ఏళ్లకే టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి నటన నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 
 
14 ఏళ్ల వ‌య‌సులోనే "నా తోడు కావాలి" అనే సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ సుమారుగా 50 సినిమాల వరకు నటించింది. చివరిగా ఆమె జ్యోతిలక్ష్మి అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా వచ్చి సుమారు నాలుగేళ్లు దాటుతోంది.
 
ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ నెలకొల్పిన ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఇక పూర్తి స్థాయిలో నిర్మాతగా వ్యవహరించాలని నిర్ణయించుకుందట. ఇటీవల ఆమెను ఓ తమిళ ఛానెల్ వారు.. ఏంటి సినిమాలు చేయ‌డం లేద‌ని అడిగితే.. ఇంకా ఎన్నిరోజులు హీరోయిన్‌గానే నటిస్తూ ఉంటాను.. వేరే కూడా చూసుకోవాలి క‌దా అంటూ స‌మాధానం ఇవ్వడంతో పాటుగా ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రు త‌నను సినిమాల్లో న‌టించ‌మ‌ని అడుగుతూనే ఉన్నా తానే వ‌ద్ద‌ని వారిస్తున్న‌ట్లు స్పష్టం చేసింది ఛార్మి. ప్ర‌స్తుతం రామ్ హీరోగా న‌టిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ అనే సినిమాకు ఛార్మి స‌హనిర్మాత‌గా వ్యవహరిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments