Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినీ ఎంట్రీపై 'అజ్ఞాతవాసి' సంచలన నిర్ణయం? (video)

సినీ ఎంట్రీపై 'అజ్ఞాతవాసి' సంచలన నిర్ణయం? (video)
, మంగళవారం, 14 మే 2019 (14:49 IST)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌.. టాలీవుడ్‌లో ఓ సంచలనం. ఎవరికీ లేనంత క్రేజ్. అంచంచలమైన స్టార్‌డమ్. లక్షల్లో ఫ్యాన్స్. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరు. అలాంటి పవన్ కళ్యాణ్ మంచి పీక్ దశలో ఉన్నపుడు సినీ రంగం నుంచి పొలిటికల్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెల్లడికానున్నాయి. 
 
ఈ ఫలితాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు సీట్లు వచ్చినా రాకపోయినా సరే ఆయన మాత్రం రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా, ఫలితాల తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని తీర్మానించుకున్నారు. 
 
అయితే, టాలీవుడ్‌కు చెందిన ఓ వర్గం మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తోంది. ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి చిత్ర పరిశ్రమవైపు మొగ్గు చూపుతురంటున్నారు. ఆ దిశగా పలువురు దర్శకనిర్మాతలు చర్యలు చేపట్టారనీ, ముఖ్యంగా కథలు సిద్ధం చేశారని అంటున్నారు. 
 
ఇంకొందరు అయితే, ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీస్ పతాకంలో ఓ చిత్రాన్ని నటిస్తారని నమ్మపలుకుతున్నారు. ఇప్పటికే మైత్రీ మూవీస్ పతాకం నిర్మాత వద్ద పవన్ కళ్యాణ్ కొంత మొత్తం అడ్వాన్స్ కూడా తీసుకున్నారనే అంటున్నారు. 
 
ఈ ఊహాగానాలకు పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ కేడర్‌తో జరిగిన సమావేశంలో ఓ క్లారిటీ ఇచ్చారు. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. జనసేన పార్టీకి సీట్లు వచ్చినా, రాకపోయినా సరే తాను మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ప్రకటించారు. 
 
జనసేన లక్ష్యం 25 యేళ్లు అని, అప్పటివరకు రాజకీయాల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. సో.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కొనసాగుతారని తేలిపోయింది. ఇకపోతే, పవన్ కళ్యాణ్ నటించిన చివరి చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బ‌యోపిక్ చూడ‌లేదు... ఎందుకంటే? కార‌ణం బ‌య‌ట‌పెట్టిన ద‌ర్శ‌కుడు తేజ