Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా సినిమా రన్ టైమ్ 2:36 గంటలుగా లాక్ చేసిన సెన్సార్

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (16:49 IST)
Nani dasara
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ 'దసరా' మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీని కూడా పూర్తి చేసుకుంది. దసరాకు సెన్సార్ బోర్డ్  యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
 
సినిమా రన్ టైమ్ 2:36 గంటలుగా లాక్ చేశారు. ఇలాంటి జానర్‌ సినిమాలకు ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్. టీజర్, ట్రైలర్‌లో చూసినట్లుగా కథకు భారీ స్పాన్ ఉంది. ఇందులో పల్లెటూరి స్నేహితుల మధ్య అందమైన బాండింగ్, రస్టిక్ లవ్ స్టొరీ, మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్, అందరినీ కదిలించే భావోద్వేగాలు ఇందులో వున్నాయి.  
 
డి-గ్లామరస్‌గా కనిపించే ఛాలెంజింగ్ పాత్రను పోషించారు నాని. పరిస్థితులకు అనుగుణంగా భిన్నంగా ప్రవర్తించే అనూహ్య పాత్రలో కనిపిస్తారు. ధరణిగా అతని పవర్-ప్యాక్డ్ షో సినిమా బిగ్గెస్ట్ యూఎస్ పి లలో ఒకటిగా ఉంటుంది. అలాగే వెన్నెలగా కీర్తి సురేష్ పాత్ర దసరా లో చాలా సర్ప్రైజింగ్ ఉండబోతుంది. దీక్షిత్ శెట్టి నాని స్నేహితుడిగా కనిపించనున్నారు. సముద్రఖని పాత్ర కూడా కీలకంగా ఉండబోతోంది. నిజానికి సినిమాలోని ప్రతి పాత్రకు తనదైన ప్రాధాన్యత ఉంటుంది.
 
సత్యన్ సూర్యన్ ప్రతి సన్నివేశాన్ని అత్యంత ఆకర్షణీయంగా చిత్రీకరించగా, సంతోష్ నారాయణన్ తన మ్యూజిక్ మాయాజాలంతో సన్నివేశాలను మరో స్థాయికి ఎలివేట్ చేశారు. సినిమా ప్రధాన భాగాన్ని పల్లెటూరి నేపధ్యంలో రూపొందించారు. భారీ ఖర్చుతో  22 ఎకరాల్లో సహజమైన పల్లెటూరి వాతావరణం రిక్రియేట్ చేస్తూ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా అద్భుతమైన సెట్స్ వేశారు.    ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌ తో 'దసరా'ని అద్భుతంగా నిర్మించారు. అది ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది.
ట్రైలర్ కేవలం శాంపిల్ మాత్రమే. సినిమాలో చాలా సర్ప్రైజ్‌లు ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments