Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి జ్యోతిక బుక్కయ్యారు... (వీడియో)

ఒకపుడు ఇటు తెలుగు, అటు తమిళ చిత్రపరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జ్యోతిక. ఆ తర్వాత తమిళ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇపుడు ఈమె ఇద్దరు పిల్లలకు తల్లి. గత కొన్ని రోజులుగా గృహిణింగా ఉంట

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (13:19 IST)
ఒకపుడు ఇటు తెలుగు, అటు తమిళ చిత్రపరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జ్యోతిక. ఆ తర్వాత తమిళ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇపుడు ఈమె ఇద్దరు పిల్లలకు తల్లి. గత కొన్ని రోజులుగా గృహిణింగా ఉంటూ వచ్చిన జ్యోతిక.. ఇటీవలే నాచియార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 
 
జ్యోతిక కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో ఓ కేసు విచారణలో భాగంగా బూతుపదాలను ఉపయోగించారు. ఇది సంచలనమైంది. ఇదే అంశంపై కోయంబ‌త్తూరుకి చెందిన ఓ వ్య‌క్తి స్థానిక పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే రాజ‌న్, టీజ‌ర్‌లో జ్యోతిక వాడిన ప‌దాలు మ‌హిళ‌ల గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
ఇప్పుడు ఆ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంద‌ని, స‌మాచార సాంకేతిక చ‌ట్టం సెక్ష‌న్ 67 ప్ర‌కారం అది త‌ప్పు అని రాజ‌న్ పిటిష‌న్‌లో తెలిపాడు. అలాగే ఐపీసీ సెక్ష‌న్ 294బి ప్ర‌కారం కూడా బూతుల‌ను మాట్లాడ‌టం శిక్షార్హం. 'నాచియార్‌' చిత్రంలో పోలీసు అధికారిగా న‌టిస్తున్న జ్యోతిక, దోషిని విచారించే క్ర‌మంలో బూతు వాడ‌టం టీజ‌ర్‌లో ఉంది. ఈ చిత్రానికి బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments