Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీ ఆలయం నుంచి పవన్ సినిమా టైటిల్ విడుదల..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ఈ ప్రీ లుక్‌లో పవన్ కల్యాణ్ సూర్యోదయాన్ని చూ

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (12:57 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ఈ ప్రీ లుక్‌లో పవన్ కల్యాణ్ సూర్యోదయాన్ని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 
 
ఇప్పటికే అజ్ఞాతవాసి అనే పేరును ఈ చిత్రానికి పెడతారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి డూపర్ హిట్ సినిమాలకు తర్వాత త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబోలో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్, కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ షూటింగ్ కాశీలో జరుగోతుంది. 
 
ఈ నేపథ్యంలో కాశీ నుంచే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్టు సమాచారం. కాశీలోని విశ్వనాథ ఆలయంలో అజ్ఞాతవాసి టైటిల్ వున్న బాక్సును ఓపెన్ చేసి టైటిల్‌ను ప్రకటించనున్నారని తెలిసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుప్రసిద్ధ ఆలయంలో పవన్ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments