Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

దేవీ
గురువారం, 10 ఏప్రియల్ 2025 (18:42 IST)
LV Gangadhar Shastri, nikl, Devan, Chota K Naidu
దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ లవ్ స్టొరీ రూపోందుతోంది. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమాకి 'కృష్ణ లీల' అనే బ్యాటీఫుల్ టైటిల్ ఖరారు చేశారు. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హీరో నిఖిల్, బ్రహ్మశ్రీ ఎల్ వీ గంగాధర్ శాస్త్రి, డీవోపీ చోటా కే నాయుడు హాజరయ్యారు.
 
హీరో నిఖిల్ మాట్లాడుతూ.. దేవన్ చాలా పాషన్ వున్న యాక్టర్ డైరెక్టర్. హ్యాపీడేస్ కి ముందు నేను కూడా ఒక మంచి అవకాశం కోసం తపన పడేవాడిని. దేవుడి దయవల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దయవల్ల తనకి కృష్ణ లీలతో పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోషన్ పోస్టరు నాకు చాలా నచ్చింది. ఇందులో దేవ్ డిఫరెంట్ సేడ్స్ నాకు చాలా నచ్చాయి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఈ టీం ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు.
 
బ్రహ్మశ్రీ ఎల్వీ గంగాధర్ శాస్త్రి మాట్లాడుతూ.. జై శ్రీకృష్ణ. దేవన్ చాలా పాజిటివ్ పర్సన్. తనని చూడగానే చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. నిరంతనం ప్రయత్నంలో ఉన్న వాడే ఎప్పటికైనా ఘనవిజయం సాధిస్తాడు. దేవన్ కూడా అలాంటి ఘన విజయం ఈ సినిమాతో సాధిస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమా రచయిత అనిల్ సంస్కారవంతులు. కృష్ణ లీల చాలా అద్భుతమైన టైటిల్. ఈ సినిమా ఆల్ టైం హిట్స్ గా నిలుస్తుందని నమ్మకం ఉంది. ఈ సినిమా పాటలు విన్నాను. చాలా గొప్ప సాహిత్యం సంగీతం ఇందులో ఉన్నాయి. ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments