Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన కేజీఎఫ్ : చాప్టర్ 2 బడ్జెట్

Webdunia
బుధవారం, 15 మే 2019 (18:46 IST)
గత యేడాది డిసెంబరు నెలలో రిలీజై భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం "కెజిఎఫ్". ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2 షూటింగ్ జరుగుతోంది. పరిమితులు అధికంగా ఉండే శాండల్‌వుడ్ మార్కెట్‌ని ఒక్కసారిగా రూ.200 కోట్ల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఈ చిత్రానికే దక్కుతుంది. 
 
ఏ కన్నడ సినిమా నార్త్‌లో ఇప్పటివరకూ ఆ స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. దీంతో ప్రజల్లో అంచనాలు పెరగటంతో కెజిఎఫ్ 2 బడ్జెట్‌ని అమాంతంగా ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‌కు పెంచినట్టు టాక్. ఇప్పటిదాకా ఏ కన్నడ సినిమాని ఇంత భారీ బడ్జెట్‌తో నిర్మించలేదు. 
 
దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగానికి చాలా మార్పులు చేసినట్లు తెలిసింది. ఫలితంగా బడ్జెట్ రేంజ్ పెరిగిపోయింది. దీనికితోడు రెట్టింపు సంఖ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేశారట. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్‌లో షూటింగ్ కోసం యష్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. 
 
కెజిఎఫ్ గనులను తన ఆధీనంలోకి తీసుకున్నాక రాఖీ భాయ్ దేశ మాఫియాని శాసించే స్థాయికి ఎదిగి ప్రధాన మంత్రే తన మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చే లెవెల్‌కి  ఎలా చేరుకున్నాడు అనే పాయింట్ మీద చాప్టర్ 2 రూపొందింది. సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి సీనియర్ బాలీవుడ్ తారలు నటిస్తున్నారన్న టాక్ కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments