Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్ కోసం పరితపిస్తున్న రజినీకాంత్

Webdunia
బుధవారం, 15 మే 2019 (15:39 IST)
సూప్ స్టార్ రజినీ తన స్టైల్ మాస్ హిట్టు కొట్టి చాలా ఏళ్ళైంది. తమిళ్‌లో 'పేట' మంచి ఫలితాన్ని ఇచ్చినా తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. రజనికాంత్-మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమా "దర్బార్‌లో రజని విశ్వరూపం ఓ రేంజ్‌లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఆ మధ్య వచ్చిన వెంకటేష్ ఘర్షణ గుర్తుందిగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా డిసిపి రామచంద్ర పాత్రలో వెంకీ చెలరేగిపోయిన తీరుకు మంచి రిజల్ట్ దక్కి కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యింది. 
 
ఈ సినిమాలో రజినీ పాత్ర అదే తరహాలో ఉంటుందట. అయితే ఘర్షణలో వెంకటేష్ చేసింది సింగిల్ రోల్ అయితే ఇందులో రజినీకాంత్ రెండు పాత్రలు చేస్తున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్‌లో రౌడీలు గూండాలు గ్యాంగ్‌స్టర్లు ఎక్కడ కనిపించినా ముందు వెనుకా ఆలోచించకుండా కాల్చిపారేసే పాత్రలో రజిని చెలరేగిపోతాడు. 
 
మరోసారి డిజాస్టర్ నమోదు కాకుండా మురుగదాస్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తెలుగువారికి కూడా నచ్చే అంశాలు ఇందులో చేర్చబోతున్నాడు. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళికి విడుదల చేయాలని షూటింగ్‌ని శరవేగంగా కానిస్తున్నారు. ఇప్పటికి ఒక పాత్ర గురించి క్లారిటీ వచ్చింది, మరో పాత్ర ఎలా ఉంటుందో అప్‌డేట్ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments