Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్లు ఇచ్చా.. ప్లీజ్ నాపేరు చెడగొట్టొద్దు... బ్రాడ్ పిట్

తన మాజీ భార్య ఏంజెలినా జోలీకి హాలీవుడ్ నటుడు బ్రాట్ పిట్ ఓ విజ్ఞప్తి చేశాడు. పిల్లల సంరక్షణార్ధం ఇప్పటికే రూ.61 కోట్లు ఇచ్చాననీ, డబ్బు ఇవ్వలేదనీ కోర్టుకెక్కి తన పేరు చెడగొట్టొద్దంటూ ప్రాధేయపడ్డాడు.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (10:33 IST)
తన మాజీ భార్య ఏంజెలినా జోలీకి హాలీవుడ్ నటుడు బ్రాట్ పిట్ ఓ విజ్ఞప్తి చేశాడు. పిల్లల సంరక్షణార్ధం ఇప్పటికే రూ.61 కోట్లు ఇచ్చాననీ, డబ్బు ఇవ్వలేదనీ కోర్టుకెక్కి తన పేరు చెడగొట్టొద్దంటూ ప్రాధేయపడ్డాడు.
 
హాలీవుడ్ సెలబ్రిటీ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్‌లు సుమారుగా 11 యేళ్ళ పాటు సహజీవనం చేయగా, వీరికి నలుగురు పిల్లలు. మరో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీంతో మొత్తం ఆరుగురు పిల్లలు. 
 
అయితే, వీరిద్దరూ 2016 సెప్టెంబరులో విడిపోయారు. అపుడు తాగుడుకు బానిసైన పిట్.. పిల్లల్ని కొట్టడంతో ఏంజెలినా విడాకులు తీసుకుంది. ఈ సందర్భంగా కోర్టు ఆరుగురు పిల్లల సంరక్షణను ఏంజెలినాకే అప్పగించింది. 
 
ఆ సమయంలో కుటుంబ పోషణ, పిల్లల సంరక్షణ కోసం బ్రాడ్ పిట్ రూ.61 కోట్లు ఇచ్చాడట. కానీ, ఏంజెలినా జోలీ మాత్రం మరోలా ఆరోపిస్తోంది. తనకు తగినంత నగదు ఇవ్వలేదని తాజాగా కోర్టును ఆశ్రయించింది. 
 
దీనిపై పిట్ స్పందించాడు. విడాకుల సమయంలో జోలీకి రూ.61 కోట్లు(9 మిలియన్ డాలర్లు) ఇచ్చానని చెప్పాడు. తన పేరు చెడగొట్టేందుకే జోలీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశాడు. కాగా, చిన్నారులను తనకూ జాయింట్ కస్టడీకి ఇవ్వాలని పిట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలుచేశాడు. దాదాపు 11 ఏళ్ల పాటు ఈ జంట సహజీవనం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments