Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యతో 3 రాత్రులు గడిపిన భర్త... 35 రోజులకే నవ వధువు ప్రసవం.. ఎలా?

శారీరకంగా కేవలం మూడంటే మూడు రాత్రులే కలిసివున్న భార్య 35 రోజులకే ప్రసవించడంతో ఆ భర్త తేరుకోలేని షాక్‌కు గురయ్యాడు. ఈ నవ వధువుకు జూలై ఒకటో తేదీన వివాహం జరిగింది. ఆమె ఆగస్టు ఐదో తేదీన అంటే సరిగ్గా 35 రో

Advertiesment
భార్యతో 3 రాత్రులు గడిపిన భర్త... 35 రోజులకే నవ వధువు ప్రసవం.. ఎలా?
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:50 IST)
శారీరకంగా కేవలం మూడంటే మూడు రాత్రులే కలిసివున్న భార్య 35 రోజులకే ప్రసవించడంతో ఆ భర్త తేరుకోలేని షాక్‌కు గురయ్యాడు. ఈ నవ వధువుకు జూలై ఒకటో తేదీన వివాహం జరిగింది. ఆమె ఆగస్టు ఐదో తేదీన అంటే సరిగ్గా 35 రోజులకే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో షాక్‌కు గురైన భర్త.. ఆమెతో కాపురం చేసేది లేదని తెగేసి చెప్పాడు. కుమార్తె చర్యతో తన పరువు పోయిందని భావించిన తండ్రి... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా రెడ్డియార్ సత్రం పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రెడ్డియార్ సత్రంకు చెందిన మునియప్పన్ అనే రైతుకు 21 యేళ్ల కుమార్తె ఉంది. ఈమెకు జూలై ఒకటో తేదీన చెన్నైలో పూల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత భార్యతో మూడు రోజులు మాత్రమే గడిపిన ఆయన చెన్నైకు వచ్చేశాడు. 
 
ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన నవ వధువు అస్వస్తకు గురికావడంతో స్థానికంగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు నిండుగర్భవతని తేల్చారు. అలా కొద్దిసేపటికే ఆ నవ వధువు పండండి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఈ విషయం తెలుసుకున్న కట్టుకున్న భర్త ఆగమేఘాలపై అత్తింటికి వెళ్లి.. ఇక ఆమెతో కాపురం చేసేది లేదని తెగేసిచెప్పి వెళ్లిపోయాడు. దీంతో బంధుమిత్రుల్లో తన పరువు పోయిందని మనస్తాపానికి గురైన ఆమె తండ్రి మునియప్పన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని గమనించిన బంధువులు, ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు పోయాయి. కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజీవనం చాలు, పెళ్లి వద్దన్నందుకు పెట్రోల్ పోసాడు