Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకనైనా నమ్మండి.. షమీ మోసం చేస్తున్నాడు.. భార్య హసీన్ జహాన్

టీమిండియా సీమర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మళ్లీ సీన్లోకి వచ్చింది. వయసుకు సంబంధించిన విషయంలో షమీ తప్పుడు సమాచారం ఇచ్చి అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపించింది. తన ఆరోపణలకు బలం చేకూర్చేలా షమీకి చెంది

Advertiesment
ఇకనైనా నమ్మండి.. షమీ మోసం చేస్తున్నాడు.. భార్య హసీన్ జహాన్
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (12:13 IST)
టీమిండియా సీమర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మళ్లీ సీన్లోకి వచ్చింది. వయసుకు సంబంధించిన విషయంలో షమీ తప్పుడు సమాచారం ఇచ్చి అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపించింది. తన ఆరోపణలకు బలం చేకూర్చేలా షమీకి చెందిన వివిధ సర్టిఫికెట్లను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసింది. ఆమె పోస్టు చేసిన వాటిలో పది, 12వ తరగతి మార్క్స్‌షీట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, చెక్‌బుక్ కాపీలు ఉన్నాయి. ఈ ఆధారాలు చూసిన తర్వాతైనా.. తన ఆరోపణలను నిజమని నమ్ముతారని ఆశాభావం వ్యక్తం చేసింది. 
 
ప్రస్తుతం షమీ ఇంగ్లండ్‌ టూర్‌లో వున్నాడు. అతని వయస్సు 28 ఏళ్లుగా చెప్తున్నాడు. తానీ హసీన్ బయటపెట్టిన సర్టిఫికెట్ల ప్రకారం అతడి వయసు 36 ఏళ్లు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఒక సర్టిఫికెట్‌లో ఉన్న డేటాఫ్ బర్త్‌కు, మరో దాంట్లో ఉన్నదానికి అసలు పొంతనే లేదు. 9, మార్చి 1990లో తాను పుట్టినట్లు షమీ చెప్పుకుంటున్నాడు. కానీ పదో తరగతి మార్క్ షీట్‌లో 3, జనవరి 1984లో జన్మించినట్టు ఉంది. డ్రైవింగ్ లైసెన్స్‌లో 5, మే 1982లో జన్మించినట్టుగా ఉంది. 
 
ఈ రెంటింటిని పరిగణనలోకి తీసుకుంటే అతడి వయసు వరుసగా 34, 36 ఏళ్లు. అయితే, మరో మార్క్స్‌షీట్‌లో మాత్రం 3, సెప్టెంబరు 1990గా నమోదైంది. బీసీసీఐ రికార్డుల్లో ఉన్నది ఇదేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరి షమీ పుట్టిన రోజుపై గందరగోళంగా వున్న ఈ సర్టిఫికేట్ల విషయంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెస్ వాడియాతో వివాదం.. ప్రీతిజింటా స్పందించాలి.. హైకోర్టు ఆదేశం