Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతని కోసం నా కలల్ని చంపుకున్నా : షమీ భార్య

భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్. భార్యాభర్తలిద్దరికీ మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. పైగా, కుమార్తె పోషణ కోసం నెలకు రూ.10 లక్షల భరణం చెల్లించాలంటూ జహాన్ న్యాయపోరాట

Advertiesment
అతని కోసం నా కలల్ని చంపుకున్నా : షమీ భార్య
, ఆదివారం, 8 జులై 2018 (15:32 IST)
భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్. భార్యాభర్తలిద్దరికీ మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. పైగా, కుమార్తె పోషణ కోసం నెలకు రూ.10 లక్షల భరణం చెల్లించాలంటూ జహాన్ న్యాయపోరాటం చేస్తోంది.
 
ఈనేపథ్యంలో జహాన్ స్పందిస్తూ, 'షమీ కోసం నా కెరీర్‌ను, ఇష్టాలను వదిలేసుకున్నా. నా కలల్ని చంపుకున్నా. కానీ, అతని నుంచి నాకేం ఒరగలేదు. పైగా ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేశాడు. అందుకే నాకు గుర్తింపునిచ్చి.. తిండి పెట్టిన ఫీల్డ్‌లోకి తిరిగి వచ్చేసినట్టు చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం మోడలింగ్‌ కోసం కోల్‌కతాతోపాటు ముంబై, ఇతర నగరాల్లో అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. మోడలింగ్‌ కోసం మొదట పాత పరిచస్తులకు, స్నేహితులకు ఫోన్‌ చేయాలంటే ఇబ్బందిగా అనిపించిందని, కానీ, కూతురి కెరీర్‌ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వారితో మాట్లాడి అవకాశాలు పొందుతున్నట్టు తెలిపింది. 
 
కాగా, భర్త షమీ ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు నడుపుతున్నాడంటూ ఆరోపణలతో మొదలుపెట్టిన హసీన్‌.. లైంగిక ఆరోపణలు, ఫిక్సింగ్‌, గృహ హింస తదితర కేసులతో షమీకి ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరకు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సైతం కలిసి న్యాయం చేయాలని ఆమె కోరిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిఫా వరల్డ్ కప్ : 28 యేళ్ల తర్వాత సెమీఫైనల్స్‌కు ఇంగ్లండ్