Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ : భారత జట్టు ఇదే... మహ్మద్ షమీకి చోటు

భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ట్వంటీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌ ముగిసింది. ఇందులో ట్వంటీ20 సిరీస్‌ను కోహ్లీ సేన గెలుచుకోగా, వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఐదు మ్యాచ్‌

Advertiesment
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ : భారత జట్టు ఇదే... మహ్మద్ షమీకి చోటు
, బుధవారం, 18 జులై 2018 (17:24 IST)
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ట్వంటీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌ ముగిసింది. ఇందులో ట్వంటీ20 సిరీస్‌ను కోహ్లీ సేన గెలుచుకోగా, వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఇందులోభాగంగా, తొలి మూడు టెస్ట్ మ్యాచ్‌ల కోసం జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. ఇందులో భార్యను వేధించిన కేసులో క్రికెటర్ మహ్మద్ షమీకి సెలెక్టర్లు చోటుకల్పించారు.
 
అలాగే, ఇటీవలికాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులో చివరి(18) ఆటగాడిగా తీసుకున్నారు. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో రాణించిన ఉమేష్ యాదవ్ కూడా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. బొటన వేలి గాయంతో బాధపడుతున్న పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా టెస్ట్ టీమ్‌లో చోటుదక్కింది. గాయం నుంచి కోలుకోగానే టీమ్‌తో కలవనున్నాడు. బుమ్రా జట్టులోకి ఎంపికయినా.. రెండో టెస్ట్ నుంచి తుది జట్టులోకి వస్తాడని బీసీసీఐ తెలిపింది. 
 
ఇకపోతే, యువ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కూడా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక యొ యొ టెస్ట్ పాసయిన మరో పేసర్ మహ్మద్ షమి కూడా ఎంపికయ్యాడు. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వెన్ను గాయం కారణంగా టెస్టు టీమ్‌లోకి అతన్ని తీసుకోవాలా వద్ద అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని సెలెక్టర్లు తెలిపారు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తొలిసారి టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. 
 
టెస్ట్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్‌ జట్టులోకి వచ్చాడు. అయితే వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను సెలెక్టర్లు తొలి చాయిస్‌గా ఎంపిక చేశారు. టెస్ట్ స్పెషలిస్ట్‌లు పుజారా, ఇషాంత్, అశ్విన్, జడేజాలు తమతమ స్థానాల్లో  కొనసాగనున్నారు. ఓపెనర్లుగా ధావన్, విజయ్, రాహుల్ ఎంపికయ్యారు. కరుణ్ నాయర్, రోహిత్‌లు ఎంపికయినా రిజర్వు బెంచ్‌కే పరిమితం కానున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఎడ్‌బాస్ట‌న్‌లో జరుగనుంది. 
 
భారత టెస్ట్ క్రికెట్ జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, అంజిక్యా రహానే, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్డే సిరీస్‌ దక్కేది ఎవరికి?.. నేడు ఇంగ్లండ్ - భారత్ ఆఖరాట