Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీఛీ.. పాకిస్థాన్ కంటే ఘోరమా.. 4జీ స్పీడ్‌లో దరిద్రంగా ఉన్నాం

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది 4జీ టెక్నాలజీ. నో బఫరింగ్.. అలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఎంతో గొప్ప టెక్నాలజీ అంటూ ఊదరగొట్టుడు ప్రచారం బాగానే చేసుకున్నాం. అంతె

Advertiesment
చీఛీ.. పాకిస్థాన్ కంటే ఘోరమా.. 4జీ స్పీడ్‌లో దరిద్రంగా ఉన్నాం
, బుధవారం, 18 జులై 2018 (10:36 IST)
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది 4జీ టెక్నాలజీ. నో బఫరింగ్.. అలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఎంతో గొప్ప టెక్నాలజీ అంటూ ఊదరగొట్టుడు ప్రచారం బాగానే చేసుకున్నాం. అంతెందుకు సరిగ్గా నాలుగు రోజు క్రితం 5జీ టెక్నాలజీ కోసం స్పీడన్ కంపెనీతో కలిసి ఢిల్లీ ఐఐటీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఓపెన్ చేస్తుందని సగర్వంగా ప్రకటించేసుకున్నాం. ఇప్పుడు అసలు విషయం తెలిసి అందరూ మొబైల్ ఫోన్లను.. తలకేసి బాదుకుంటున్నారు.
 
ఇంతకీ ఏ విషయంలో తెలుసా? 4జీ ఇంటర్నెట్ వేగంలో. మన దేశంలో 4జీ స్పీడ్ తెలిసి నోరెళ్లబెడుతున్నారు ప్రతి ఒక్కరూ. మన స్థానం ఎక్కడ ఉందో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో 124 దేశాల్లో 4జీ టెక్నాలజీ ఉంటే.. వేగంలో మాత్రం మన స్థానం 109. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే... మన కంటే శ్రీలంక, మయన్మార్, పాకిస్థాన్ దేశాలు కూడా మెరుగ్గా ఉండటం గమనార్హం. 
 
శ్రీలంక, మయన్మార్, పాకిస్థాన్ దేశాల్లో 4జీ యావరేజ్ డౌన్ లోడ్ స్పీడ్ 13.56ఎంబీపీఎస్ అయితే.. మన దేశంలో 9.12 ఎంబీపీఎస్‌గానే ఉందని.. ఓక్లా అనే స్పీడ్ టెస్ట్ కంపెనీ నిర్వహించిన సర్వేలో తేలింది. 4జీ టెక్నాలజీ అందులోబాటు వచ్చిన తర్వాత కూడా వీడియోలు బఫరింగ్ అవుతూనే ఉన్నాయని చెప్పింది. 
 
ఆఫర్స్, కస్టమర్లను పెంచుకునే దిశలోనే కంపెనీలు అమితాసక్తిని చూపుతున్నాయనీ, మరిన్ని టవర్స్ ఏర్పాట్లు, మెరుగైన సేవలు అందించటంపై మాత్రం దృష్టి పెట్టడం లేదని సర్వేలో వెల్లడైంది. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య కూడా 4జీ స్పీడ్ పడిపోవటానికి ఓ కారణంగా ఉందని తెలిపింది. ఏది ఏమైనా 4జీ స్పీడ్‌లో మాత్రం మన స్థానం చాలా దరిద్రంగా ఉందని ఈ సర్వే తేల్చిపారేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంట్ సమావేశాలు : మోడీ భరతం పట్టండి.. ఎంపీలతో చంద్రబాబు