Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడేళ్ళకే నిశ్చితార్థం.. కాదన్నందుకు సమాజం నుంచి వెలి... ఎక్కడ?

అభంశుభం తెలియని వయసులో నిశ్చితార్థం చేశారు. ఆ తర్వాత ఊహ తెలిసి.. ఆ వ్యక్తిని నేను చేసుకోను అని అన్నందుకు ఏకంగా ఆ యువతితో పాటు.. ఆమె కుటుంబాన్నే సమాజం నుంచి వెలి వేశారు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని

Advertiesment
మూడేళ్ళకే నిశ్చితార్థం.. కాదన్నందుకు సమాజం నుంచి వెలి... ఎక్కడ?
, సోమవారం, 6 ఆగస్టు 2018 (11:50 IST)
అభంశుభం తెలియని వయసులో నిశ్చితార్థం చేశారు. ఆ తర్వాత ఊహ తెలిసి.. ఆ వ్యక్తిని నేను చేసుకోను అని అన్నందుకు ఏకంగా ఆ యువతితో పాటు.. ఆమె కుటుంబాన్నే సమాజం నుంచి వెలి వేశారు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగౌర్ జిల్లాలో పీల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంసెడ్ గ్రామానికి చెందిన ఓ యువతికి మూడేళ్ళ వయసులోనే నిశ్చితార్థం చేశారు. నౌరత్ బావ్లా అనే యువకుడితో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగింది. 
 
ఇపుడు ఈ యువతి నౌరత్‌ను పెళ్లి చేసుకోబోనని ఆమె తెగేసి చెబుతోంది. అతను ఓ నిరక్ష్యరాస్యుడని అందువల్ల అతన్ని పెళ్లి చేసుకోబోనని మొండికేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా ఏం చేయలేక పోయారు. 
 
ఈ విషయం గ్రామ పంచాయతీ పెద్దల దృష్టికి వెళ్లింది. ఈ వివాహాన్ని కాదన్నందుకు బాధితురాలి కుటుంబాన్ని సమాజం నుంచి వెలివేశారు. అలాగే వీరితో ఎవరైనా మాట్లాడితే రూ.5,100 జరిమానా విధించారు. దీనికితోడు బాధితురాలిని ఎవరైనా వివాహం చేసుకుంటే రూ.11 లక్షలు జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. 
 
దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన పోలీసులు నౌరత్‌తో పాటు.. మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచార దందా... పుణ్యక్షేత్రాలే అడ్డాగా...