Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా కంటే ముందుగానే బోయపాటి శ్రీను, రామ్ చిత్రం విడుదల

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (16:19 IST)
Ram Pothineni
బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BoyapatiRAPO ముగింపు దశకు చేరుకుంది. మాసీవ్ ఎనర్జీ ముందుగానే థియేటర్లలోకి రానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేయాలని మొదట భావించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ వైట్ అండ్ వైట్‌ సూపర్ చార్మింగ్‌గా కనిపిస్తున్నారు. తెల్లటి చొక్కా, లుంగీ ధరించి, పొలంలో కాఫీని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. ఈ చిత్రంలో రామ్ గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తారు. రామ్ ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు బోయపాటి.
 
మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.
 
సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు,  నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్ , పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎడిటింగ్‌ తమ్మిరాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments