బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, అత్యన్నత సాంకేతిక ప్రమాణాలతో, హ్యుజ్ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.
ఈ చిత్రం ఫస్ట్ థండర్ ను రామ్ పుట్టినరోజు అయిన మే 15 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మే 15 ఉదయం 11:25 గం. ముహూర్తంగా ఖరారు చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్ డాషింగ్, డైనమిక్‌గా కనిపిస్తున్నారు. స్టైలిష్ హెయిర్‌డో, మందపాటి గడ్డం రగ్గడ్ నెస్ ని తీసుకొచ్చింది. డెనిమ్ షర్ట్, జీన్స్ ధరించి రామ్ తన చేతిలో బేస్ బాల్ బ్యాట్‌తో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో పెద్ద ఎద్దును కూడా చూడవచ్చు. ఈ సినిమాలో మాసీవ్ క్యారెక్టర్‌లో నటించేందుకు రామ్ బీస్ట్ లుక్‌లో కనిపించారు.
హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ కు జోడిగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కొంతమంది ప్రముఖ నటులు నటిస్తున్నారు.