Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

రామ్ పోతినేనిని మాస్ లుక్‌ తో చూపిస్తున్న బోయపాటి శ్రీను

Advertiesment
Ram tst thunder
, సోమవారం, 15 మే 2023 (13:41 IST)
Ram tst thunder
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని ల మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్  #BoyapatiRAPO ఈరోజు స్టార్ రామ్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా ఫస్ట్ థండర్ బ్లాస్ట్ అయ్యింది.  
 
థండర్ ఒక బ్లాస్టింగ్ ఎపిసోడ్‌ తో ప్రారంభమవుతుంది. రామ్ తనదైన శైలిలో మాస్ ఎంట్రీ ఇస్తూ సదర్ పండుగ కు ఒక పెద్ద ఎద్దుని తీసుకువస్తాడు. అక్కడ గూండాల గ్యాంగ్ తో మాసివ్ ఫైట్ చేస్తాడు. ప్రతి ఫ్రేమ్‌ లో బోయపాటి స్టాంప్ ఉంది. రామ్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ తో అదనపు బలాన్ని తీసుకువచ్చారు.
 
రామ్ మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌ లో కనిపించాడు. పాత్ర కోసం తన శరీరాన్ని బిల్డ్ చేశారు. “నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా... నీ గేటు దాటలేనన్నావ్ దాటా... నీ పవర్ దాటలేనన్నావ్ దాటా... ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్...” అనే డైలాగ్ అభిమానులను, మాస్ ని మెప్పిస్తుంది. శ్రీలీల ని కూడా వీడియోలో చూడవచ్చు.
 
సంతోష్ డిటాకే తన ఎక్స్టార్డినరీ కెమెరా పనితనం తో ఆకట్టుకున్నాడు. ఎస్ఎస్  థమన్ తన థండర్స్ తో కూడిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ తో విజువల్స్‌ ను ఎలివేట్ చేశాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌  తమ్మిరాజు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకట్టుకుంటున్న రూల్స్ రంజన్ మొదటి పాట