Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో బోయపాటి శ్రీను, రామ్ చిత్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (18:31 IST)
Boyapati Srinu and Ram
దర్శకుడు. బోయపాటి శ్రీను ముఖ్యంగా కథానాయకుడిని చూపించే విధానం బావుంటుంది. ఆయన దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా సినిమా రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్రతిష్టాత్మకంగా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 
 
దసరా సందర్భంగా రామ్ సరసన కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే, ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్. తమన్ మ్యూజిక్ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ''మా దర్శకుడు బోయపాటి శ్రీను 'అఖండ' విజయం తర్వాత చేస్తున్న చిత్రమిది. ఆ సినిమాకు రోరింగ్ రీ రికార్డింగ్ అందించిన తమన్ మా సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. వాటికి తగ్గట్టు సినిమా ఉంటుంది. రామ్ ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే క్యారెక్టర్‌ను బోయపాటి శ్రీను డిజైన్ చేశారు. 
 
ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. స్టంట్ శివ నేతృత్వంలో ఆ యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నాం. సుమారు 30 రోజులు ఈ షెడ్యూల్ ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఉన్నత సాంకేతిక విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ - ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని చెప్పారు. 
 
రామ్, శ్రీ లీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ : తమ్మిరాజు, సినిమాటోగ్రఫీ : సంతోష్ డేటకీ, యాక్షన్ : స్టంట్ శివ, సంగీతం : ఎస్. తమన్, సమర్పణ : పవన్ కుమార్, నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, దర్శకత్వం : బోయపాటి శ్రీను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

ఈ-కార్ రేస్‌కు నిధుల మళ్లింపు - ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments