Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో శ్రీముఖి స్టెప్పులేస్తే.. ఈ వీడియోలో చూడండి.. (video)

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (18:05 IST)
Pawan_SriMukhi
ఆహా ఓటీటీ తెలుగులో దూసుకుపోతోంది. ఇటీవల "తెలుగు ఇండియన్ ఐడల్" సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్‌గా సక్సెస్ చేసింది. ప్రస్తుతం డ్యాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త డ్యాన్స్ షోతో వచ్చింది ఆహా. తాజాగా ఈ షోనుంచి ప్రోమో రిలీజ్ అయ్యింది.  
 
ఈ డ్యాన్స్ ఐకాన్ షోలో శేఖర్ మాస్టర్‌తో పాటు రమ్యకృష్ణ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షోకి ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి, మోనాల్ గజ్జర్, యశ్వంత్ మాస్టర్ టీం హెడ్స్‌గా ఉన్నారు. బెస్ట్ డ్యాన్సర్లు ఈ షోకి వచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే పూనకాలు రావడం ఖాయం. 
 
 


 
ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెటప్‌లో వున్న వ్యక్తితో శ్రీముఖి డ్యాన్స్ చేయడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో గబ్బర్ సింగ్‌లోని పాటకు పవర్ స్టార్ డ్యాన్స్ చేయడం.. శ్రీముఖి కూడా ఆయన తగినట్లు స్టెప్పులేయడం.. అందుకు ఓంకార్, రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ అదుర్స్ అని అభినందించడం హైలైట్‌గా నిలిచింది. 
 
ఈ వీడియో ప్రోమోలో స్టేజ్ మీద ఎనర్జీ పెరిగింది.. ఫెర్‌ఫార్మెన్స్‌లు అదిరిపోయాయ్.. గెట్ రెడీ ఫర్ పవర్ ఫుల్ ఎనర్జీ అంటూ ఆహా పోస్టు చేసింది. ఈ ప్రోమోకు సంబంధించిన డ్యాన్స్ ఐకాన్ ఆహా ఎపిసోడ్స్ (7, 8) ప్రీమియర్ షో లు శని, ఆదివారాలు రాత్రి  తొమ్మిది గంటలకు ప్రసారం అవుతాయని తెలిపింది. ఇంకేముంది.. తాజా ప్రోమో వీడియోను ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments