Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్ ఫస్ట్ లుక్.. ప్రభాస్ సన్నగా.. స్మార్ట్‌గా కనిపిస్తున్నాడే!

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (12:24 IST)
డార్లింగ్ ప్రభాస్ జాన్ ఫస్ట్ లుక్‌పై ఇప్పటికే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్ డే హంగామా మొదలైపోయింది. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 
 
తనపై ఇంత అభిమానం చూపిస్తోన్న ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. అది ఆయన కొత్త ఉబెర్ కూల్ ఆల్ట్రా స్టైలిష్ లుక్. ‘బాహుబలి’లో ప్రభాస్ చాలా భారీగా కనిపించారు. కండలు తిరిగిన దేహంతో ఒక యోధుడిగా కనిపించాడు. సాహోలోనూ కండలు పెంచేశాడు. కానీ జాన్ సినిమా కోసం ప్రభాస్ ఒళ్లు తగ్గించేశాడు. 
 
రాబోయే సినిమాలో మాత్రం చాలా స్మార్ట్‌గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన కొత్త లుక్కే చెబుతోంది. ప్రభాస్ హీరోగా ఆయన పెదనాన్న కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
 
జిల్ ఫేమ్ కె.కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన న్యూ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో ప్రభాస్ చాలా సన్నగా, స్మార్ట్‌గా కనిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments