Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వకు కెప్టెన్సీనా.. ఐపీఎల్‌తో పోటీపడనున్న బిగ్ బాస్ 4..?

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (15:27 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ టీఆర్పీ రేటింగ్ కాస్త తగ్గిన నేపథ్యంలో.. ఐపీఎల్‌తో పోటీ పడేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్ పోటీని తట్టుకునేందుకు దూకుడు పెంచాడు బిగ్‌బాస్. హౌస్‌మేట్స్‌కు అద్భుతమైన టాస్క్స్‌ ఇచ్చి. . ఇంట్లో సెగలురేపుతూ.. బయటి ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. నిన్న మొన్న జరిగిన 'ఉక్కు హృదయం; టాస్క్‌ రసవత్తరంగా జరిగింది. 
 
రోబోలు, హ్యూమన్స్‌గా విడిపోయిన సభ్యులు గేమ్‌లో లీనమయ్యి.. ఆకట్టుకున్నారు. మనుషుల ఆవేశం.. రోబోల ప్రశాంతం.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రోబో జట్టు మైండ్ గేమ్ ఆడి హ్యూమన్స్‌పై విజయం సాధించారు.
 
ఇక హ్యూమన్స్ జట్టులో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన నోయెల్‌ను బిగ్ బాస్.. జైల్లో పెట్టాడు. అతడికి రాగి జావ, పళ్లు తప్ప ఏ ఇతర ఆహార పదార్థాలు, పానీయాలు ఇవ్వకూడదని హౌస్ సభ్యులను ఆదేశించాడు. విజేతగా నిలిచిన రోబో జట్టులో ముగ్గురు అద్భుత ప్రదర్శన చేసినట్లు మిగతా సభ్యులు చెబుతారు. వారే అభిజీత్, అవినాష్, గంగవ్వ, హారిక. ఈ నలుగురిలో ఒకరు కెప్టెన్‌గా ఎంపికవుతారు. 
 
దానికి సంబంధించిన టాస్క్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. 'రంగు పడుద్ది.. జాగ్రత్త' పేరుతో ఈ టాస్క్‌ ఇవాళ జరగబోతోంది. బిగ్ బాస్ కెప్టెన్ పదవి కోసం కుర్రాళ్లు అభిజీత్, అవినాష్, హారికతో తలపడుతోంది గంగవ్వ. మరి వారిని ఓడించి కెప్టెన్‌గా ఎంపికవుతుందా? లేదా? తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments